Breaking News

నీలమ్, కాజల్‌కు రజతాలు 

Published on Thu, 10/29/2026 - 06:02

అస్తానా: ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగంలో దేశానికి తొలి పసిడి పతకం దక్కే అవకాశం చేజారింది. ఫైనల్‌ చేరిన ఇద్దరు భారత రెజ్లర్లు పరాజయం పాలై రజతాలతో సరిపెట్టుకున్నారు. 

బుధవారం  50 కేజీల తుదిపోరులో నీలమ్‌ సిరోహి 0–5తో నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌ యు ససాకి (జపాన్‌) చేతిలో పరాజయం పాలవగా... 76 కేజీల ఫైనల్లో కాజల్‌ ధోచక్‌ 6–8తో మూడుసార్లు యూరోపియన్‌ చాంపియన్‌ అనస్తాసియా అల్పియోవా (ఉక్రెయిన్‌) చేతిలో ఓడింది. 

2010 వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల విభాగంలో భారత రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ ఏకైక స్వర్ణం సాధించగా... మహిళల విభాగంలో ఇప్పటి వరకు దేశానికి పసిడి పతకం దక్కలేదు. టోర్నీ చరిత్రలో తొలిసారి ఇద్దరు భారత మహిళా రెజ్లర్లు ఫైనల్‌కు అర్హత సాధించి రికార్డు సృష్టించినా.... స్వర్ణం సాధించడంలో మాత్రం విఫలమయ్యారు. ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో భారత్‌ నుంచి ఇప్పటి వరకు అన్షు మలిక్‌ (2021లో రజతం; 57 కేజీలు) మాత్రమే ఫైనల్‌కు చేరి రజతం దక్కించుకుంది.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)