Breaking News

భార‌త జ‌ట్టులో కీల‌క మార్పులు.. అత‌డిపై వేటు! తెలుగోడికి చోటు?

Published on Fri, 06/27/2025 - 11:31

ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓట‌మిపాలైన టీమిండియా ఇప్పుడు మ‌రో కీల‌క పోరుకు సిద్ద‌మ‌వుతోంది. జూలై 2 నుంచి ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో ప్రారంభ‌మ‌య్యే రెండో టెస్టులో అమీతుమీ తెల్చుకోవ‌డానికి భార‌త్ సిద్ద‌మైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో స‌మం చేయాల‌ని గిల్ సేన ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ క్ర‌మంలో రెండో టెస్టు కోసం భార‌త జ‌ట్టులో కీల‌క మార్పులు చోటు చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

శార్ధూల్ ఠాకూర్‌పై వేటు..?
తొలి టెస్టులో దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ శార్ధూల్ ఠాకూర్‌(Shardul thakur)పై వేటు వేసేందుకు టీమిండియా మెనెజ్‌మెంట్ సిద్ద‌మైంది. లీడ్స్ టెస్టులో శార్ధూల్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.  బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన ఠాకూర్‌.. బౌలింగ్‌లో కేవలం  రెండు వికెట్లు పడగొట్టాడు.

ఈ క్రమంలో శార్ధూల్ బదులుగా ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish kumar reddy)ని తీసుకోవాలని గంభీర్ అండ్ కో భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో నితీశ్ తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మెల్‌బోర్న్ టెస్టులో ఓ సెంచరీ కూడా సాధించాడు. దీంతో తిరిగి మళ్లీ అతడిని తుది జట్టులోకి తీసుకోవాలని టీమ్‌ మెనెజ్‌మెంట్ యోచిస్తుందంట. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలనుకుంటే శార్థూల్ స్ధానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులో​కి వచ్చే ఛాన్స్ ఉంది.

బుమ్రాకు విశ్రాంతి..?
ఇక రెండో టెస్టుకు వర్క్‌లోడ్ కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్‌మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.  బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని ఈ సిరీస్‌కు ముందే భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు.

దీంతో రెండో టెస్టుకు అతడికి విశ్రాంతి ఇచ్చి తిరిగి లార్డ్స్ టెస్టులో ఆడించాలని గంభీర్ అండ్ కో భావిస్తున్నరంట. తొలి టెస్టులో బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల హాల్‌తో బుమ్రా చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ పడగొట్టకపోయినప్పటికి దాదాపు 20 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఒకవేళ రెండో టెస్టుకు బుమ్రా దూరమైతే అతడి స్ధానంలో అర్ష్‌దీప్ సింగ్ అరంగేట్రం చేసే అవకాశముంది. లేదంటే పేసర్ ఆకాష్ దీప్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భార‌త తుది జ‌ట్టు(అంచ‌నా)
యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్‌, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)