Breaking News

'కోహ్లిలా నిన్ను నువ్వు న‌మ్ముకో'.. ఆసీస్ స్టార్‌ ప్లేయర్‌కు మెంటార్ సలహా

Published on Tue, 11/26/2024 - 20:06

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట‌ర్ మార్నస్ ల‌బుషేన్ ప్ర‌స్తుతం గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాడు. పెర్త్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన తొలి టెస్టులో ల‌బుషేన్ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి కేవ‌లం 5 ప‌రుగులు మాత్ర‌మే ల‌బుషేన్ చేశాడు.

అంతేకాకుండా భార‌త బౌల‌ర్ల‌ను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బంది ప‌డ్డాడు. జస్ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్ త‌మ బౌన్స‌ర్‌ల‌తో ల‌బుషేన్‌ను బెంబేలెత్తించారు. అయితే తొలి మ్యాచ్‌లో ఓటమి అనంతరం మార్నస్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు.

డిసెంబర్ 6న ఆడిలైడ్ వేదికగా జరగనున్న రెండో టెస్టుతో తిరిగి ఫామ్‌లోకి రావాలని అతడు భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో లబుషేన్‌కు తన మెంటార్  నీల్ డి'కోస్టా సపోర్ట్‌గా నిలిచాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిలా తనను తను లబుషేన్ నమ్మాలి అని నీల్ సూచించాడు.

"లబుషేన్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడు. అతడు కొంచెం కష్టపడితే తన ఫామ్‌ను తిరిగి పొందుతాడన్న నమ్మకం నాకు ఉంది. నెట్స్‌లో కొంచెం ఎక్కువ సమయం గడపాలి. ఒకనొక దశలో లబుషేన్ వరల్డ్ నెం1గా కొంత‌కాలం కొనసాగాడు. కానీ ఆత‌ర్వాత అత‌డు త‌న రిథ‌మ్‌ను కోల్పోయాడు.

ఇప్ప‌టికి అత‌డు టెస్టుల్లో టాప్ 10 ర్యాంక్స్‌ లోనే ఉన్నాడు. అదేవిధంగా అత‌డి బ్యాటింగ్ స‌గ‌టు కూడా దాదాపు ఏభైకి ద‌గ్గ‌ర‌గా ఉంది. ఇటువంటి ప్లేయ‌ర్లకు ఒక్క భారీ ఇన్నింగ్స్‌లో తిరిగి త‌న రిథ‌మ్‌ను పొందే స‌త్తాఉంటుంది. ఎంత‌టి టాప్ క్లాస్ క్రికెట‌ర్ల‌రైనా ఏదో ఒక స‌మ‌యంలో క‌ఠిన ప‌రిస్థితుల‌ను ఎదుర్కొక త‌ప్ప‌దు. 

విరాట్ కోహ్లి లాంటి ప్లేయ‌ర్ కూడా ఒకనొక స‌మ‌యంలో గ‌డ్డు పరిస్థితులును ఎదుర్కొన్నాడు. కానీ త‌న‌ను త‌ను న‌మ్ముతూ తిరిగి మ‌ళ్లీ అద్బుత‌మైన క‌మ్‌బ్యాక్ ఇచ్చాడు. నీవు కూడా కోహ్లిలా నిన్ను న‌మ్ముకో, నీ ఆట‌పై దృష్టి పెట్టూ అంటూ" ఈఎస్పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీల్ డి'కోస్టా పేర్కొన్నాడు.
చదవండి: అతడొక విధ్వంసక బ్యాటర్‌.. అందుకే భారీ ధర: ఆర్సీబీ బ్యాటింగ్‌ కోచ్‌ డీకే

 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)