Breaking News

విరాట్‌ కోహ్లి తాజా పోస్ట్‌ వైరల్‌.. ఇంతకీ రన్‌మెషీన్‌ ఏమన్నాడంటే!

Published on Wed, 06/21/2023 - 19:49

Virat Kohli posts another spiritual story: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతర క్రికెటర్లెవరికీ సాధ్యం కాని రీతిలో 253 మిలియన్‌ ఫాలోవర్లను కలిగి ఉన్నాడు ఈ రన్‌మెషీన్‌. ట్విటర్‌లోనూ ఈ రికార్డుల కింగ్‌కు ఫాలోయింగ్‌ ఎక్కువే.

ప్రస్తుతం కోహ్లి ట్విటర్‌ ఖాతాకు 56.4 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఎప్పటికప్పుడు వృత్తిగత, వ్యక్తిగత విషయాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే కోహ్లి గత రెండ్రోజులుగా ఫుల్‌ యాక్టివ్‌ అయిపోయాడు. వరుస పోస్టులతో ముందుకు వస్తున్నాడు.

ఈగో నుంచి బయటపడేసేది అదే
మొన్నటికి మొన్న జిమ్‌ వీడియో షేర్‌ చేసిన ఈ మాజీ సారథి.. తాజాగా క్రిప్టిక్‌ పోస్టు షేర్‌ చేశాడు. ‘‘మెదుడు అనుమానాలతో సతమతం అవుతుంది. అదే మనసులో ఎల్లప్పుడూ నమ్మకంతో ముందుకు సాగుతుంది. నిజానికి.. ఈగో మైండ్‌ నుంచి బయటపడేందుకు నమ్మకమే ఓ వారధిలా పనిచేస్తుంది’’ అన్న కోట్‌ను ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నాడు. ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

స్థాయికి తగ్గట్లు రాణించలేదు
కాగా కోహ్లి ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌-2023 ఫైనల్లో ఆడాడు. ఇంగ్లండ్‌లోని ఓవల్‌ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడిన టీమిండియా ఈ మ్యాచ్‌లో 209 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో కోహ్లి విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగులే చేసిన విరాట్‌.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకానికి పరుగు దూరంలో నిలిచిపోయాడు.

ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌ తర్వాత టీమిండియా ఆటగాళ్లకు దాదాపు నెలరోజుల పాటు విశ్రాంతి లభించింది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి సెలవులను ఆస్వాదిస్తున్నారు పలువురు క్రికెటర్లు. కాగా తదుపరి జూలై 12- ఆగష్టు 13 వరకు టీమిండియా వెస్టిండీస్‌ పర్యటనలో బిజీ కానుంది.

చదవండి: Ind Vs WI: విండీస్‌కు కష్టాలు! సందిగ్దంలో టీమిండియాతో టెస్టు సిరీస్‌!
ధోనికి పిల్లనిచ్చిన అత్తగారు! ఆ కంపెనీ సీఈఓ.. రూ. 800 కోట్ల సామ్రాజ్యం!

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)