Breaking News

సౌతాఫ్రికా జట్టులోకి డేంజరస్‌ ప్లేయర్లు

Published on Thu, 01/22/2026 - 22:53

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026కు ముందు సౌతాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్లు టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా గాయాల కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. వారిద్దరి స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్లు ట్రిస్టన్ స్టబ్స్‌, ర్యాన్ రికెల్టన్ వరల్డ్‌కప్ జట్టులోకి వచ్చారు.

ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. టోనీ డి జోర్జి విషయానికి వస్తే.. గతేడాది ఆఖరిలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతడికి కుడి కాలికి గాయమైంది. అతడు వరల్డ్‌కప్ సమయానికి కోలుకుంటాడని ప్రోటీస్ సెలక్టర్లు భావించారు. కానీ టోనీ పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరింత సమయం పడుతోంది. 

ఈ క్రమంలోనే అతడు పొట్టి ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు. మరోవైపు సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో ఫెరీరా గాయ‌ప‌డ్డాడు. ప్రిటోరియా క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఫెరీరా(జోబ‌ర్గ్ సూప‌ర్ కింగ్స్‌) భుజం ఎముక విరిగింది. దీంతో అత‌డు కూడా  ఈ మెగా టోర్నీకి అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రికెల్టన్‌, స్టబ్స్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు.

అదేవిధంగా ఈ మెగా టోర్నీ విధ్వంస‌కర ప్లేయ‌ర్ డేవిడ్ మిల్ల‌ర్ కూడా దూర‌మ‌య్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. మిల్ల‌ర్ ప్ర‌స్తుతం కండరాల గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో వ‌ర‌ల్డ్‌క‌ప్ ముందు వెస్టిండీస్‌తో జ‌రిగే టీ20 సిరీస్‌కు మిల్ల‌ర్ దూర‌మ‌య్యాడు. అత‌డిస్ధానంలో రూబెన్ హెర్మ‌న్‌కు చోటు ఇచ్చారు. 

టీ20 ప్రపంచకప్‌-2026కు సౌతాఫ్రికా జట్టు
ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్‌, క్వింటన్ డి కాక్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, కగిసో రబడా, జాసన్ స్మిత్.

వెస్టిండీస్‌తో టీ20లకు ప్రోటీస్‌ జట్టు
ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్‌, క్వింటన్ డి కాక్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, హెర్మన్‌, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, కగిసో రబడా, జాసన్ స్మిత్.

 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు