ఇంగ్లండ్‌తో వన్డే,టీ20 సిరీస్‌.. న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన! స్టార్‌ బౌలర్‌ వచ్చేశాడు

Published on Wed, 08/09/2023 - 09:43

ఇంగ్లండ్ టూర్‌కు తమ జట్టును న్యూజిలాండ్‌ క్రికెట్‌ ప్రకటించింది. ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా కివీస్‌ 4 టీ20లు, 4 వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌లకు వేర్వేరు జట్లను న్యూజిలాండ్‌ సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా ఇంగ్లండ్‌ పర్యటనకు కివీస్‌ రెగ్యూలర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ సందర్భంగా గాయపడిన విలియమ్సన్‌ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

కేన్‌మామ తిరిగి వన్డే ప్రపంచకప్‌తో మైదానంలో అడుగు పెట్టే అవకావం ఉంది. ఇక ఇంగ్లండ్‌తో వన్డేలకు బ్లాక్‌క్యాప్స్‌ కెప్టెన్‌గా టామ్‌ లాథమ్‌ ఎంపిక కాగా.. టీ20ల్లో ఫాస్ట్‌బౌలర్‌ టిమ్‌ సౌథీ సారధిగా వ్యవహరించనున్నాడు.

ట్రెంట్‌ బౌల్ట్‌ రీ ఎంట్రీ..
ఇక గతేడాది బ్లాక్ క్యాప్స్ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్న స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌.. మళ్లీ జాతీయ జట్టు తరపున ఆడేందుకు సిద్దమయ్యాడు. ఇంగ్లండ్‌తో వన్డేలకు బౌల్ట్‌కు కివీస్‌ జట్టులో చోటుదక్కింది. అదే విధంగా స్టార్‌ ఆల్‌రౌండర్‌ మైఖేల్‌ బ్రెస్‌వేల్‌ గాయం కారణంగా ఇంగ్లండ్‌ టూర్‌కు మొత్తం దూరమయ్యాడు.

ఇంగ్లండ్‌ కంటే ముందు..
ఇక న్యూజిలాండ్‌ జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు యూఏఈకు వెళ్లనుంది. అతిథ్య యూఏఈతో మూడు టీ20ల సిరీస్‌లో కివీస్‌ తలపడనుంది. ఆగస్టు 17న దుబాయ్‌ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో యూఏఈతో సిరీస్‌కు కూడా కివీస్‌ తమ జట్టును ప్రకటించింది. యూఏఈ పర్యటనలో కూడా టిమ్‌ సౌథీనే జట్టును నడిపించనున్నాడు. అదే విధంగా ఆల్‌రౌండర్లు  డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌, ఆది అశోక్కు తొలిసారి కివీస్‌ జట్టులో చోటు దక్కింది.

ఇంగ్లండ్‌తో టీ20లకు కివీస్‌ జట్టు: టిమ్ సౌథీ (సి), ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ రవీంద్ర సీఫెర్ట్, ఇష్ సోధి

ఇంగ్లండ్‌తో వన్డేలకు న్యూజిలాండ్‌ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్‌), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, విల్ యంగ్

యూఏఈతో టీ20లకు న్యూజిలాండ్ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్‌), ఆది అశోక్, చాడ్ బోవ్స్, మార్క్ చాప్మన్, డేన్ క్లీవర్, లాకీ ఫెర్గూసన్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, కైల్ జామీసన్, కోల్ మెక్‌కాంచీ, జిమ్మీ నీషమ్, రచిన్ సె రవీంద్ర, మిచెల్ సీ రవీంద్ర, మిచెల్ సీ రవీంద్ర షిప్లీ, విల్ యంగ్
చదవండి: IND vs WI: మరీ ఇంత స్వార్ధమా.. ధోనిని చూసి నేర్చుకో! ఏంటి హార్దిక్ ఇది? పాపం తిలక్‌ వర్మ


 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)