Breaking News

ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. విధ్వంస‌క‌ర వీరుడు దూరం!?

Published on Mon, 12/23/2024 - 21:14

మెల్‌బోర్న్ వేదిక‌గా డిసెంబ‌ర్ 26 నుంచి భార‌త్‌తో జ‌ర‌గ‌నున్న నాలుగో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌ త‌గిలే అవ‌కాశ‌ముంది. బాక్సింగ్ డే టెస్టుకు ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు ట్రావిస్ హెడ్ గాయం కార‌ణంగా దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది.

హెడ్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. బ్రిస్బేన్‌​ వేదికగా జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హెడ్ కుంటుతూ కన్పించాడు. అతడు భారత్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఫీల్డింగ్‌కు కూడా రాలేదు.

అయితే కాసేపటికే వర్షం కారణంగా మ్యాచ్ డ్రా కావడంతో అతడు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. కాగా సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. 30 ఏళ్ల హెడ్ నాలుగో టెస్టు కోసం ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్‌లో కూడా కన్పించలేదంట.

అతడు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో  మంగళవారం ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాల్గోనున్నట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తమ కథనంలో పేర్కొం‍ది. కాగా హెడ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి మూడు టెస్టుల్లో హెడ్ రెండు సెంచరీలు నమోదు చేశాడు.

ఒకవేళ బాక్సింగ్‌​ డే టెస్టుకు హెడ్ దూరమైతే అసీస్‌కు నిజంగా గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. మరోవైపు జోషల్ హాజిల్‌వుడ్ సైతం గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాక్‌ ఓపెనర్‌.. ప్రపం‍చంలోనే తొలి ప్లేయర్‌గా
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)