Breaking News

హెడ్‌ విధ్వంసకర సెంచరీ.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్‌

Published on Fri, 09/20/2024 - 07:46

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. నాటింగ్‌హామ్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో  7 వికెట్ల తేడాతో ఆసీస్‌ ఘన విజయం సాధించింది. 316 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. 

భారీ లక్ష్య చేధనలో కంగారుల ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ విధ్వంసం సృష్టించాడు. తనదైన శైలిలో ఇంగ్లండ్‌ బౌలర్లను ఊతికారేశాడు. కేవలం 129 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్స్‌లతో 154 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో మార్నస్‌ లబుషేన్‌(77) పరుగులతో రాణించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో పొట్స్‌, బెతల్‌, లివింగ్‌స్టోన్‌ తలా వికెట్‌ సాధించారు. అంతకముందు బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 49.4 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది. 

బెన్‌ డకెట్‌ (91 బంతుల్లో 95; 11 ఫోర్లు) త్రుటిలో శతకం చేజార్చుకోగా...విల్‌ జాక్స్‌ (56 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. కెపె్టన్‌ హ్యారీ బ్రూక్‌ (31 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), జాకబ్‌ బెతెల్‌ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా రాణించారు. ఆ్రస్టేలియా బౌలర్లలో లబుషేన్‌, జంపా చెరో 3 వికెట్లు పడగొట్టగా...ట్రవిస్‌ హెడ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం లీడ్స్‌లో జరుగుతుంది. 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)