Breaking News

పాండ్యా కుటుంబంలో 9 ఐపీఎల్‌ ట్రోఫీలు ఉంటాయని హార్దిక్‌కు చెప్పాను: ​కృనాల్‌

Published on Thu, 06/05/2025 - 16:51

రెండు రోజుల క్రితం ముగిసిన ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ఆర్సీబీ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. జూన్‌ 3న జరిగిన ఫైనల్లో ఆ జట్టు పంజాబ్‌ కింగ్స్‌పై గెలిచి, 18 ఏళ్ల ఐపీఎల్‌ ప్రస్తానంలో తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్‌ మ్యాచ్‌లో కృనాల్‌ పాండ్యా అద్బుతమైన బౌలింగ్‌ ప్రదర్శన (4-0-17-2) చేసి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. 

తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో రెండు సార్లు ఫైనల్‌ మ్యాచ్‌ల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. కృనాల్‌ 2017 సీజన్‌లో తొలిసారి ఫైనల్లో (RPSపై) ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

ఈ సీజన్‌ ఫైనల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్న తర్వాత కృనాల్‌ పాండ్యా యాంకర్‌ రవిశాస్త్రితో మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని షేర్‌ చేసుకున్నాడు. 11 ఏళ్లలో పాండ్యా ఫ్యామిలీలో 9 ఐపీఎల్‌ ట్రోఫీలు ఉంటాయని హార్దిక్‌కు చెప్పినట్లు రివీల్‌ చేశాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు కృనాల్‌ చాలా ఎమోషనల్‌ అయ్యాడు. ఈ స్థాయికి చేరడానికి హార్దిక్‌, నేను కఠోరంగా శ్రమించామని తెలిపాడు. కృనాల్‌కు వ్యక్తిగతంగా ఇది నాలుగో టైటిల్‌ కాగా.. హార్దిక్‌ ఇదివరకే 5 ఐపీఎల్‌ టైటిల్స్‌ సాధించాడు.

2016లో కృనాల్‌ ఐపీఎల్‌ జర్నీ ముంబై ఇండియన్స్‌ తరఫున మొదలైంది. 2017, 2019, 2020 సీజన్లలో అతను ఆ ఫ్రాంచైజీ తరఫునే మూడు టైటిళ్లు గెలిచాడు. ఇప్పుడు ఆర్సీబీ తరఫున తన నాలుగో ఐపీఎల్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. 34 ఏళ్ల ఈ బరోడా ఆఫ్‌ స్పిన్నర్‌ ఆర్సీబీ తరఫున తన నాలుగో ఐపీఎల్‌ టైటిల్‌ గెలవాలనుకున్నట్లు ఫ్రాంచైజీలో చేరిన మొదటి రోజే చెప్పాడు.

హార్దిక్‌ విషయానికొస్తే.. 2015లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన హార్దిక్‌.. ఆ ఫ్రాంచైజీ తరఫున 2015, 2017, 2019, 2020 సీజన్లలో టైటిళ్లు గెలిచాడు. అనంతరం గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా 2022లో తన ఐదో టైటిల్‌ను సాధించాడు. పాండ్యా సోదరులు కలిపి 9 టైటిళ్లు గెలవడం చూస్తే ఐపీఎల్‌ టైటిల్స్‌ అంటే ఆ ఇద్దరికి ఎంత పిచ్చో అర్దమవుతుంది.

ప్లేయర్లుగా అత్యధిక ఐపీఎల్‌ టైటిళ్లు గెలిచిన ఆటగాళ్లు..
రోహిత్‌ శర్మ-6 (డెక్కన్‌ ఛార్జర్స్‌, ముంబై)
అంబటి రాయుడు-6 (ముంబై, సీఎస్‌కే)
ఎంఎస్‌ ధోని-5 (సీఎస్‌కే)
కీరన్‌ పోలార్డ్‌-5 (ముంబై)
హార్దిక్‌ పాండ్యా-5 (ముంబై, గుజరాత్‌) 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)