Breaking News

హుమేరా–పూజా జోడీకి టైటిల్‌

Published on Mon, 10/21/2024 - 03:09

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డబ్ల్యూ15 టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి హుమేరా బహార్మస్‌ డబుల్స్‌ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. బెంగళూరులో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో హుమేరా భారత్‌కే చెందిన పూజా ఇంగాలెతో కలిసి డబుల్స్‌ విభాగంలో విజేతగా నిలిచింది. 

హోరాహోరీగా సాగిన ఫైనల్లో టాప్‌ సీడ్‌ హుమేరా–పూజా ద్వయం 3–6, 6–0, 10–6తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఆకాంక్ష–సోహా సాదిక్‌ (భారత్‌) జోడీపై గెలిచింది. 78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హుమేరా–పూజా రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. 

తమ సర్వీస్‌ను రెండుసార్లు చేజార్చుకొని, ప్రత్యర్థి జోడీ సర్విస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశారు. హుమేరా కెరీర్‌లో ఇది రెండో ఐటీఎఫ్‌ డబుల్స్‌ టైటిల్‌. 2022లో హైదరాబాద్‌కే చెందిన శ్రీవల్లి రష్మికతో కలిసి హుమేరా గుర్‌గ్రామ్‌లో జరిగిన ఐటీఎఫ్‌ టోర్నీలో తొలిసారి డబుల్స్‌ టైటిల్‌ను సాధించింది.  

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)