Breaking News

తెలుగు టైటాన్స్‌ జోరు

Published on Thu, 10/09/2025 - 04:15

చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌–12) సాగే కొద్దీ తెలుగు టైటాన్స్‌ జోరు పెరుగుతోంది. ఈ లీగ్‌లో టైటాన్స్‌ జట్టు వరుసగా ఐదో విజయాన్ని సాధించింది. బుధవారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్‌ 46–29తో డిఫెండింగ్‌ చాంపియన్‌ హరియాణా స్టీలర్స్‌పై గెలుపొందింది. టైటాన్స్‌ జట్టులో ఆల్‌రౌండర్‌ భరత్‌ హుడా (20 పాయింట్లు) అదరగొట్టాడు. పీకేఎల్‌లో వందో మ్యాచ్‌ ఆడుతున్న భరత్‌ 18 సార్లు కూతకెళ్లి 16 పాయింట్లు తెచ్చిపెట్టాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు రెయిడింగ్‌కు వస్తే నలుగుర్ని టాకిల్‌ చేశాడు. 

మరో ఆల్‌రౌండర్, కెపె్టన్‌ విజయ్‌ మలిక్‌ (8) కూడా టైటాన్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంకిత్‌ 3, చేతన్‌ సాహు, అవి దుహన్, అజిత్‌ పవార్, శుభమ్‌ షిండే తలా 2 పాయింట్లు చేశారు. హరియాణా ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టుకు దీటుగా పాయింట్లు సాధించడంలో విఫలమయ్యారు. రెయిడర్‌ మయాంక్‌ సైని 5, కెపె్టన్‌ జైదీప్, వినయ్‌ చెరో 4 పాయింట్లు చేశారు. 

అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌ 37–27తో యూ ముంబాపై జయభేరి మోగించింది. పుణేరి రెయిడర్‌ ఆదిత్య షిండే (14) రాణించాడు. మిగతా వారిలో కెపె్టన్‌ అస్లామ్‌ (5), పంకజ్‌ మోహితే (4) మెరుగ్గా ఆడారు. యూ ముంబా తరఫున రెయిడర్లు అజిత్‌ చౌహాన్‌ (10), సందీప్‌ (7) చక్కగా పోరాడారు. గురువారం జరిగే పోటీల్లో బెంగాల్‌ వారియర్స్‌తో దబంగ్‌ ఢిల్లీ, గుజరాత్‌ జెయంట్స్‌తో యూపీ యోధాస్‌ తలపడతాయి.  

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు