Breaking News

న్యూజిలాండ్‌ టెస్టు కెప్టెన్సీకి సౌథీ గుడ్‌బై.. కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

Published on Wed, 10/02/2024 - 09:34

టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ వెట‌ర‌న్ టిమ్ సౌథీ అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నాడు. కివీస్ టెస్టు జ‌ట్టు కెప్టెన్సీ నుంచి సౌథీ త‌ప్పుకున్నాడు. ఇటీవ‌ల శ్రీలంక‌తో జ‌రిగిన సిరీస్‌లో  2-0 తేడాతో న్యూజిలాండ్ ఘోర ప‌రాభావం చూసిన త‌ర్వాత సౌథీ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు.

నాకు ఇష్ట‌మైన రెడ్ బాల్ ఫార్మాట్‌లో న్యూజిలాండ్ కెప్టెన్‌గా ప‌నిచేయ‌డం నాకు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్నాను. నా కెరీర్‌లో జ‌ట్టును నెం1గా నిల‌ప‌డానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాను. ఇప్పుడు కూడా ఆట‌గాడిగా నావంతు పాత్ర పోషిస్తున్నాను. జ‌ట్టు ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఓ ప్రకటనలో సౌథీ పేర్కొన్నాడు.

కాగా గతేడాది కేన్ విలియమ్సన్ నుంచి కివీస్ టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు సౌథీ చేపట్టాడు. అయితే కెప్టెన్‌గా సౌథీ పర్వాలేదన్పించాడు. అతడి సారథ్యంలో 14 టెస్టులు ఆడిన బ్లాక్ క్యాప్స్‌.. ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, మరో 6 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. మరో రెండు మ్యాచ్‌లను ఓటమితో ముగించింది.

న్యూజిలాండ్ కెప్టెన్‌గా లాథమ్‌..
ఇక బ్లాక్ క్యాప్స్ టెస్టు కెప్టెన్‌గా వెటరన్ వికెట్ కీపర్ టామ్ లాథమ్ బాధ్యతలు చేపట్టాడు. ఆక్టోబర్ 16 నుంచి భారత్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్టుతో కివీస్ కెప్టెన్‌గా లాథమ్ ప్రయాణం మొదలు కానుంది. లాథమ్ వన్డే, టెస్టు ఫార్మాట్‌లో కివీస్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇక భారత్‌తో కివీస్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం కివీస్‌ ఆక్టోబర్ 10న భారత్‌కు వచ్చే ఛాన్స్ ఉంది.
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)