Breaking News

టీ20 క్రికెట్‌లో అతి భారీ సిక్స‌ర్‌.. వ‌ర‌ల్డ్ రికార్డు బ్రేక్‌

Published on Sun, 11/02/2025 - 16:21

హోబర్ట్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట‌ర్ టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు ఆసీస్‌కు అర్ష్‌దీప్ సింగ్ ఆరంభంలోనే బిగ్ షాకిచ్చాడు. అతడి బౌలింగ్ ధాటికి హెడ్‌, ఇంగ్లిష్ వికెట్లను ఆతిథ్య జట్టు కోల్పోయింది.

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన డేవిడ్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. హోబర్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో డేవిడ్ కేవలం 23 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా  38 బంతులు మాత్రమే ఎదుర్కొన్న డేవిడ్‌.. 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు.

డేవిడ్ భారీ సిక్సర్‌..
కాగా ఈ మ్యాచ్‌లో డేవిడ్ భారీ సిక్సర్‌తో మెరిశాడు.  అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఈ ఆసీస్ డెంజ‌ర‌స్ బ్యాట‌ర్ 129 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఆసీస్ ఇన్నింగ్స్ ఆరో ఓవ‌ర్ వేసిన అక్ష‌ర్ ఐదో బంతిని.. టాసడ్ ఆఫ్ డెలివ‌రీగా సంధించాడు. ఆ డెలివ‌రీని డేవిడ్ ముందుకు వ‌చ్చి స్ట్రైట్ డ్రైవ్ షాట్ ఆడాడు. 

అత‌డి ప‌వ‌ర్ ధాటికి బంతి నింజా స్టేడియం బ‌య‌టకు వెళ్లింది. అత‌డి షాట్ చూసి మైదానంలో అంద‌రూ షాక్ అయిపోయారు. ఈ క్రమంలో డేవిడ్  అంతర్జాతీయ టీ20ల్లో భారీ సిక్సర్ బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ పేరిట ఉండేది. 

2012లో గప్టిల్ సౌతాఫ్రికాపై 127 మీటర్ల సిక్స్ బాదాడు. తాజా మ్యాచ్‌తో గప్టిల్ ఆల్‌టైమ్ రి​కార్డును డేవిడ్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో డేవిడ్, మార్టిన్ గప్టిల్ తర్వాత యువరాజ్ సింగ్(119 మీటర్లు), క్రిస్ గేల్(116 మీటర్లు) ఉన్నారు.
చదవండి: కరుణ్‌ నాయర్‌ డబుల్‌ సెంచరీ

 


 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)