Breaking News

తిలక్‌ @3

Published on Thu, 11/21/2024 - 03:55

దుబాయ్‌: దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో రెండు సెంచరీలతో విజృంభించిన భారత యువ ఆటగాడు ఠాకూర్‌ తిలక్‌ వర్మ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. సఫారీలపై ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచిన తిలక్‌ వర్మ ఐసీసీ బుధవారం విడుదల చేసిన టి20 బ్యాటింగ్‌ తాజా ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్‌–10లోకి ప్రవేశించడమే కాకుండా... కెరీర్‌ అత్యుత్తమంగా 3వ స్థానానికి చేరుకున్నాడు. 

ఈ క్రమంలో తిలక్‌ 69 స్థానాలు ఎగబాకడం విశేషం. ఈ జాబితాలో ఆ్రస్టేలియా ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ (855 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా... ఇంగ్లండ్‌ ప్లేయర్‌ ఫిల్‌ సాల్ట్‌ (828 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్‌ నుంచి అత్యుత్తమ ర్యాంక్‌ గల ఆటగాడిగా తిలక్‌ వర్మ (806 పాయింట్లు) నిలవగా... సూర్యకుమార్‌ (788 పాయింట్లు) ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పరిమితమయ్యాడు. 

భారత్‌ నుంచి యశస్వి జైస్వాల్‌ (8వ ర్యాంక్‌) కూడా టాప్‌–10లో చోటు దక్కించుకున్నాడు. ఇదే సిరీస్‌లో రెండు సెంచరీలతో సత్తా చాటిన ఓపెనర్‌ సంజూ సామ్సన్‌ 22వ ర్యాంక్‌కు చేరాడు.

నాలుగు నెలల తర్వాత... 
ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్యా నాలుగు నెలల తర్వాత మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది జూన్‌ 29న తొలిసారి నంబర్‌వన్‌ ర్యాంక్‌ కు ఎగబాకిని పాండ్యా ఆ తర్వాత తన టాప్‌ ర్యాంక్‌ను కోల్పోయాడు.

అయితే దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అటు బ్యాట్‌తో ఇటు బంతితో రాణించిన హార్దిక్‌ 244 పాయింట్లతో మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి అత్యుత్తమంగా రవి బిష్ణోయ్‌ ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)