Breaking News

కౌంటీ క్రికెట్‌లో భీకర ఫామ్‌.. కెప్టెన్‌గా ఎంపికైన తిలక్‌ వర్మ

Published on Sun, 07/27/2025 - 15:52

టీమిండియా యువ బ్యాటర్‌, హైదరాబాద్‌ ప్లేయర్‌ తిలక్‌ వర్మ దులీప్‌ ట్రోఫీ-2025 కోసం సౌత్‌ జోన్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా (వైస్‌ కెప్టెన్‌) కేరళకు చెందిన మహ్మద్‌ అజహారుద్దీన్‌ నియమితుడయ్యాడు. 

దులీప్‌ ట్రోఫీ కోసం 16 మంది రెగ్యులర్‌ సభ్యులు, ఆరుగురు స్టాండ్‌ బై ప్లేయర్లతో కూడిన జట్టును నిన్న ఎంపిక చేశారు. ఈ జట్టులో తిలక్‌తో పాటు దేవ్‌దత్‌ పడిక్కల్‌, రవి శ్రీనివాసన్‌ సాయి కిషోర్‌ లాంటి ఐపీఎల్‌ స్టార్లు చోటు దక్కించుకున్నారు.

ఈ సీజన్‌ దులీప్‌ ట్రోఫీ గతంలో జరిగిన జోనల్‌ విధానంలోనే (ఆరు జట్లు) జరుగనుంది. గత సీజన్‌లో ఈ టోర్నీని నాలుగు జట్లతో (ఇండియా ఏ, బి, సి, డి) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌ దులీప్‌ ట్రోఫీ ఆగస్ట్‌ 28 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు జరుగనుంది.

భీకర ఫామ్‌లో తిలక్‌
సౌత్‌ జోన్‌ కెప్టెన్‌గా ఎంపికైన తిలక్‌ వర్మ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ మ్యాచ్‌ల్లో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌తోనే హ్యాంప్‌షైర్‌ తరఫున కౌంటీ అరంగేట్రం చేసిన తిలక్‌.. తన తొలి మ్యాచ్‌లోనే అద్బుతమైన సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. అనంతరం వరుసగా 56, 47 పరుగులు చేసి, ఆతర్వాత మరో సెంచరీతో మెరిశాడు.

అంతర్జాతీయ కమిట్‌మెంట్స్‌ కారణంగా గత రంజీ సీజన్‌లో హైదరాబాద్‌ జట్టుకు అందుబాటులో లేని తిలక్‌ ఈ దేశవాలీ సీజన్‌ ప్రారంభంలోనే సౌత్‌జోన్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

సౌత్ జోన్ దులీప్ ట్రోఫీ 2025 జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్‌) (హైదరాబాద్), మహ్మద్ అజహారుద్దీన్ (వైస్‌ కెప్టెన్‌) (కేరళ), తన్మయ్ అగర్వాల్ (హైదరాబాద్), దేవదత్ పడిక్కల్ (కర్ణాటక), మోహిత్ కాలే (పాండిచ్చేరి), సల్మాన్ నిజర్‌ (కేరళ), నారాయణ్‌ జగదీసన్‌ (తమిళనాడు), త్రిపురణ విజయ్ (ఆంధ్ర), ఆర్ సాయి కిషోర్ (తమిళనాడు), తనయ్ త్యాగరాజన్ (హైదరాబాద్), విజయ్‌కుమార్ వైషాక్ (కర్ణాటక), నిధీష్ ఎండి (కేరళ), రికీ భుయ్ (ఆంధ్ర), బాసిల్ ఎన్‌పి (కేరళ), గుర్జప్‌నీత్ సింగ్ (తమిళనాడు), స్నేహల్ కౌతాంకర్ (గోవా)

స్టాండ్ బై ప్లేయర్లు: మోహిత్ రెడ్కర్ (గోవా), ఆర్ స్మరణ్ (కర్ణాటక), అంకిత్ శర్మ (పాండిచ్చేరి), ఈడెన్ యాపిల్ టామ్ (కేరళ), ఆండ్రీ సిద్దార్థ్ (తమిళనాడు), షేక్ రషీద్ (ఆంధ్ర).

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)