Breaking News

IPL 2023: తిలక్‌ వర్మ.. మరో సురేశ్‌ రైనా

Published on Sat, 05/27/2023 - 11:22

ముంబై ఇండియన్స్‌ నయా సంచలనం నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ.. తన ఆరాధ్య క్రికెటర్‌ సురేశ్‌ రైనాను ఫాలో అవుతున్నాడు. షాట్లు ఆడే విధానంలోనే కాక, రికార్డులు నమోదు చేయడంలోనే తిలక్‌.. రైనా అడుగుజాడల్లో నడుస్తున్నాడు. నిన్న (మే 26) గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో 14 బంతుల్లో 307.14 స్ట్రయిక్‌ రేట్‌తో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసిన తిలక్‌.. గతంలో రైనా సాధించిన ఓ అరుదైన రికార్డును షేర్‌ చేసుకున్నాడు.

2014 సీజన్‌లో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రైనా 25 బంతుల్లో 348 స్ట్రయిక్‌ రేట్‌తో 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ చరిత్రలో 40 అంతకంటే ఎక్కువ పరుగులు చేసి, 300కు పైగా స్ట్రయిక్‌ రేట్‌ నమోదు చేసిన తొలి ఆటగాడిగా రైనా రికార్డుల్లోకెక్కాడు. తాజాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్‌ ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రైనా సరసన చేరాడు. నాటి మ్యాచ్‌లో రైనా జట్టు ఎలాగైతే భారీ లక్ష్య ఛేదనలో పోరాడి ఓడిందో.. గుజరాత్‌తో మ్యాచ్‌లో ముంబై సైతం అలాగే పోరాడి ఓటమిపాలైంది. 

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌-2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిన్న (మే 26) జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా గుజరాత్‌ వరుసగా రెండో సీజన్‌లో ఫైనల్లోకి అడుగుపెట్టి, టైటిల్‌ పోరులో సీఎస్‌కేతో అమీతుమీకి సిద్ధమైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. శుభ్‌మన్‌ గిల్‌ విధ్వంసకర శతకంతో (60 బంతుల్లో 129; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడటంతో  నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన ముంబై.. మోహిత్‌ శర్మ (5/10) ధాటికి 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. సూర్యకుమార్‌ (38 బంతుల్లో 61), తిలక్‌ వర్మ (14 బంతుల్లో 43) మెరుపులు వృధా అయ్యాయి.

చదవండి: గెలవదగిన ఆట ఆడలేదు.. శుభ్‌మన్‌ సూపర్‌, అదే మా ఓటమికి కారణం: రోహిత్‌ శర్మ
 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)