Breaking News

ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు రెడీ: తిలక్‌ వర్మ

Published on Sun, 12/14/2025 - 02:58

ధర్మశాల: భారత జట్టులో ఎక్కువ మంది ప్లేయర్లు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని... హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ అన్నాడు. దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో భాగంగా ఆదివారం మూడో మ్యాచ్‌ జరగనుండగా... దానికి ముందు శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తిలక్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో తిలక్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

‘జట్టులో ఓపెనర్లు తప్ప మిగిలిన వాళ్లు ఎవరైనా ఏ స్థానంలో అయినా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. పరిస్థితులకు తగ్గట్లు ఇమిడిపోయే విధంగా ఉండాలి. ఏ నిర్ణయమైనా జట్టు కోసమే. ఈ అంశంపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ స్పష్టంగా ఉంది. నా వరకైతే మూడో స్థానం నుంచి మొదలు ఎక్కడ బ్యాటింగ్‌ చేయడానికైనా సిద్ధమే. అందరూ అలాగే ఉన్నారు. వన్‌డౌన్‌లో అక్షర్‌ ఎన్నోసార్లు ఆకట్టుకున్నాడు. అది పరిస్థితులను బట్టి తీసుకునే నిర్ణయమే’అని తిలక్‌ అన్నాడు. 

ధర్మశాలలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని... అందుకు తగ్గట్లే జట్లు సన్నద్ధత ఉంటుందని తిలక్‌ అన్నాడు. ‘నేను అండర్‌–19 స్థాయిలో ఇక్కడ మ్యాచ్‌లు ఆడాను. పిచ్‌ను పరిశీలిస్తే భారీ స్కోర్లు నమోదయ్యేలా కనిపిస్తోంది. చలితీవ్రత అధికంగా ఉండే ధర్మశాలలో పిచ్‌ పేసర్లకు అనుకూలించనుంది. టాస్‌ మన చేతిలో ఉండదు. అందుకే దేనికైనా సిద్ధంగా ఉండాలి. బంతిపై పట్టు చిక్కించుకునేందుకు తడిచిన బంతితో సైతం ప్రాక్టీస్‌ చేస్తున్నాం.   

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)