భీకర ఫామ్‌లో తిలక్‌ వర్మ.. హ్యాట్రిక్‌ సెంచరీలు.. ఇప్పుడు..!

Published on Fri, 11/29/2024 - 12:37

టీమిండియా ఆటగాడు తిలక్‌ వర్మ నవంబర్‌ నెలలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ నెలలో తిలక్‌ ఏకంగా మూడు సెంచరీలు, రెండు హాఫ్‌ సెంచరీలు చేశాడు. నవంబర్‌ 13న సౌతాఫ్రికాపై సెంచరీ (107 నాటౌట్‌ (56 బంతుల్లో)) చేసిన తిలక్‌.. ఆతర్వాత నవంబర్‌ 15న ఆదే సౌతాఫ్రికాపై మరో సెంచరీ (120 నాటౌట్‌ (47 బంతుల్లో)) బాదాడు. 

ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో తిలక్‌ ఓ సెంచరీ, రెండు హాఫ్‌ సెంచరీలు చేశాడు. నవంబర్‌ 23న మేఘాలయతో జరిగిన తొలి మ్యాచ్‌లో 67 బంతుల్లో శతక్కొట్టిన (151) తిలక్‌.. ఆతర్వాతి మ్యాచ్‌లో (నవంబర్‌ 25) బెంగాల్‌పై హాఫ్‌ సెంచరీ (57) చేశాడు. 

దీని తర్వాత ఒక్క మ్యాచ్‌లో విఫలమైన తిలక్‌, తిరిగి ఇవాళ (నవంబర్‌ 29) బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో హాఫ్‌ సెంచరీతో (51 నాటౌట్‌) మెరిశాడు. మొత్తంగా నవంబర్‌ మాసం తిలక్‌కు అచొచ్చినట్లుంది. ఈ నెలలో తిలక్‌ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో సత్తా చాటాడు. టీ20ల్లో హ్యాట్రిక్‌ సెంచరీలు నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా తిలక్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం​ తెలిసిందే. ఈ ఫీట్‌ను కూడా తిలక్‌ నవంబర్‌లోనే సాధించాడు.

ఇదిలా ఉంటే, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో భాగంగా బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఆటగాడు తిలక్‌ వర్మ అజేయమైన సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో బీహార్‌పై హైదరాబాద్‌ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బీహార్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. తెలకపల్లి రవితేజ 4 వికెట్లు తీసి బీహార్‌ను దెబ్బకొట్టాడు. మిలింద్‌, అజయ్‌ దేవ్‌ గౌడ్‌ తలో 2, నితిన్‌ సాయి యాదవ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. బీహార్‌ ఇన్నింగ్స్‌లో కుమార్‌ రజనీశ్‌ (22) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్‌ 12.3 ఓవర్లలో వికెట్‌ నష్టపోయి విజయతీరాలకు చేరింది. తిలక్‌ వర్మ (31 బంతుల్లో 51 నాటౌట్‌; ఫోర్‌, 4 సిక్సర్లు), రోహిత్‌ రాయుడు (33 బంతుల్లో 56 నాటౌట్‌; 7 ఫోర్లు, సిక్స్‌) హైదరాబాద్‌ను గెలిపించారు. 
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)