Breaking News

అరంగేట్రంలో తిల‌క్ వ‌ర్మ అట్ట‌ర్ ప్లాప్‌..

Published on Tue, 08/05/2025 - 21:12

టీమిండియా యువ ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ ఇంగ్లండ్ డొమాస్టిక్‌ వ‌న్డే క‌ప్ అరంగేట్రంలో తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. మంగ‌ళ‌వారం వేల్స్ క్రికెట్ గ్రౌండ్ వేదిక‌గా గ్లామోర్గాన్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో హాంప్‌షైర్ త‌ర‌పున బ‌రిలోకి దిగిన తిల‌క్‌.. డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.

మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన తిల‌క్ కేవ‌లం  మూడు బంతులు మాత్ర‌మే ఆడి ఖాతా తెరవ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. పేస‌ర్ నెడ్ లియోనార్డ్ బౌలింగ్‌లో అస ట్రైబ్‌కు క్యాచ్ ఇచ్చి ఈ హైదరాబాదీ ఔట‌య్యాడు. అయితే అంతకుముందు కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో తిలక్ అదరగొట్టాడు. 4 మ్యాచ్‌ల‌లో హాంప్‌షైర్ త‌ర‌పున తిల‌క్ 358 ప‌రుగులు చేశాడు. అందులో రెండు సెంచ‌రీలు ఉన్నాయి.

ఇక ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన గ్లామోర్గాన్ కెప్టెన్ కిరణ్ కార్ల్సన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన హాంప్‌షైర్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 324 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

హాంప్‌షైర్ కెప్టెన్ గుబ్బిన్స్(144) భారీ సెంచ‌రీతో మెరిశాడు. అత‌డితో పాటు బెన్ మేయస్(74), ఓర్‌(45) రాణించారు. గ్లామోర్గాన్ బౌల‌ర్ల‌లో నెడ్ లియోనార్డ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌లో గ్లామోర్గాన్ 28 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 175 ప‌రుగులు చేసింది.

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)