Breaking News

ఏంటి బ్రో ఇది.. నాటౌట్‌కు ఔట్‌ ఇచ్చేసిన థర్డ్‌ అంపైర్‌! వీడియో వైరల్‌

Published on Sun, 01/07/2024 - 09:15

బిగ్ బాష్ లీగ్ 2023-24లో భాగంగా శనివారం మెల్‌బోర్న్‌ వేదికగా సిడ్నీ సిక్సర్స్, మెల్‌బోర్న్ స్టార్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసింది. క్లియర్‌గా నాటౌట్‌ అయినప్పటికీ థర్డ్ అంపైర్ పొరపాటున ఔట్‌గా ప్రకటించేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

అసలేం జరిగిందంటే?
సిడ్నీ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ వేసిన ఇమాడ్‌ వసీం బౌలింగ్‌లో జేమ్స్‌ విన్స్‌ స్ట్రైయిట్‌ డ్రైవ్‌ షాట్‌ ఆడాడు. బౌల‌ర్ వ‌సీమ్ బంతి ఆపేందుకు ప్ర‌య‌త్నించ‌గా అత‌డి తాకుతూ బంతి నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న స్టంప్స్‌ను ప‌డ‌గొట్టింది. దీంతో బౌలర్‌తో పాటు మెల్‌బోర్న్‌ ఫీల్డర్లు రనౌట్‌కు అప్పీల్‌ చేశారు. ఈ క్రమంలో ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌కు రిఫీర్‌ చేశారు.

రిప్లేలో బంతి స్టంప్స్‌ను తాకే సమయానికి బ్యాటర్ క్రీజులోకి వచ్చినట్లు క్లియర్‌గా కన్పించింది. దీంతో థర్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని వెల్లడించడానికి సిద్దమయ్యాడు. అయితే అనూహ్యంగా బిగ్‌స్క్రీన్‌లో ఔట్‌ కన్పించింది. దీంతో ఒక్కసారిగా మైదానంలో గందరగోళం నెలకొంది. అయితే థర్డ్‌  నాటౌట్‌ బటన్‌కు బదులుగా తప్పుడు బటన్‌ నొక్కడంతో ఇలా జరిగింది.

తన తప్పిదాన్ని గ్రహించిన థర్డ్‌ అంపైర్‌ వెంటనే నాటౌట్‌ బటన్‌ నొక్కడంతో బ్యాటర్‌ ఊపిరి పీల్చుకున్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. 157 పరుగుల లక్ష్యాన్ని సిడ్నీ సిక్స‌ర్స్ 18.1 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సిడ్నీ బ్యాట‌ర్ల‌లో జేమ్స్ విన్స్‌ (79) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. కాగా మొద‌ట బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 156 ప‌రుగులు చేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)