Breaking News

ప్రెసిడెంట్స్‌ కప్‌లో తీగల సాహిత్‌ రెడ్డి

Published on Fri, 09/27/2024 - 03:55

మాంట్రియాల్‌: భారత సంతతి గోల్ఫర్‌ తీగల సాహిత్‌ రెడ్డి ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్‌ కప్‌లో అమెరికా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత సంతతి గోల్ఫర్‌గా సాహిత్‌ చరిత్రకెక్కాడు. గురువారం ప్రారంభమైన ఈ టోర్నీలో అమెరికా జట్టు... యూరోప్‌ దేశాల మినహా ఇతర దేశాల ఆటగాళ్లతో కూడిన రెస్ట్‌ ఆఫ్‌ వరల్డ్‌ జట్టుతో పోటీపడుతోంది. 

రాయల్‌ మాంట్రియాల్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో ఆడటం చాలా సంతోషంగా ఉందని పీజీఏ టూర్‌ టైటిల్‌ సాధించిన సాహిత్‌ పేర్కొన్నాడు. సాహిత్‌ తల్లిదండ్రులు మురళీధర్, కరుణ 1980 దశకంలో హైదరాబాద్‌ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. సాహిత్‌ కాలిఫోర్నీయాలో పుట్టి పెరిగాడు. ‘మా నాన్న భారత్‌ నుంచి అమెరికాకు వచ్చినప్పుడు ఇలాంటి ఒక రోజు వస్తుందని కచ్చితంగా ఊహించి ఉండడు. 

ప్రెసిడెంట్స్‌ కప్‌లో పాల్గొనడం అంటే మామూలు విషయం కాదు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు ఎలా సాగాలో మా నాన్న నుంచే నేర్చుకున్నా. ప్రతిష్టాత్మక టోర్నీలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి మించి ఏం ఉంటుంది. మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తా. 

కుటుంబ సభ్యుల సమక్షంలో ఆడనుండటం మరింత ఉత్సహాన్నిస్తోంది’అని సాహిత్‌ పేర్కొన్నాడు. 1994 నుంచి ఈ టోర్నీని నిర్వహిస్తుండగా... ఇప్పటి వరకు 14 ఎడిషన్‌లు జరిగాయి. అందులో 12 సార్లు గెలిచిన అమెరికా జట్టు ఒకసారి ఓడిపోయింది. మరో మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది.
 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)