Breaking News

ఒలింపిక్స్‌ నుంచి తప్పుకున్న వరల్డ్‌ నంబర్‌ వన్‌

Published on Thu, 07/25/2024 - 12:39

పురుషుల నంబర్‌ వన్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు జన్నిక్‌ సిన్నర్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి తప్పుకున్నాడు. అస్వస్థత (టాన్సిల్స్‌) కారణంగా విశ్వ క్రీడల బరి నుంచి వైదొలుగుతున్నట్లు సిన్నర్‌ ప్రకటించాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం కోల్పోయినందుకు బాధగా ఉందని, ఇంటి నుంచే ఇటలీ అథ్లెట్లను సపోర్ట్‌ చేస్తానని సిన్నర్‌ తెలిపాడు. ఒలింపిక్స్‌లో సిన్నర్‌ సింగిల్స్‌తో పాటు డబుల్స్‌లో పోటీ పడాల్సి ఉండింది. సిన్నర్‌ వైదొలగడంతో అతని పార్ట్‌నర్‌ లొరెంజో ముసెట్టి మరో భాగస్వామిని వెతుక్కోవాల్సి వచ్చింది.

సింగిల్స్‌ పోటీల నుంచి సిన్నర్‌ తప్పుకోవడంతో ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) టాప్‌ సీడ్‌ ఆటగాడిగా బరిలో నిలుస్తాడు. ఒలింపిక్స్‌ డ్రా ఇవాళ (జులై 25) ప్రకటించే అవకాశం ఉంది. జులై 27 నుంచి తొలి రౌండ్‌ మ్యాచ్‌లు మొదలవుతాయి. ఆగస్ట్‌ 4న అన్ని విభాగాల్లో గోల్డ్‌ మెడల్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.

సిన్నర్‌ విషయానికొస్తే.. 22 ఏళ్ల ఈ ఇటలీ ఆటగాడు ఈ ఏడాది తన తొలి గ్రాండ్‌స్లామ్‌ (ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) టైటిల్‌ను సాధించాడు. సిన్నర్‌ ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీఫైనల్స్‌కు చేరాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో సిన్నర్‌ డేనియల్‌ మెద్వెదెవ్‌పై 3–6, 3–6, 6–4, 6–4, 6–3 తేడాతో అద్బుత విజయం సాధించాడు. కాగా, పారిస్‌ ఒలింపిక్స్‌ టెన్నిస్‌ క్రీడలో భారత్‌ రెండు విభాగాల్లో పోటీపడనుంది. పురుషుల సింగిల్స్‌లో సుమిత్‌ నగాల్‌.. పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న-శ్రీరామ్‌ బాలాజీ జోడీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 
 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)