Breaking News

ఇన్‌ స్టాల్‌ రీల్స్‌ చేసిన టెన్నిస్‌ ప్లేయర్‌.. హత్య చేసిన తండ్రి!

Published on Thu, 07/10/2025 - 21:42

గురుగ్రామ్‌: హర్యానా రాష్ట్రంలో దారుణం  చోటు చేసుకుంది. ఇన్‌ స్టా రీల్స్‌ చేసిందని కన్న కూతురి జీవితాన్ని చిదిమేశాడు తండ్రి.  టెన్నిస్‌లో ఎంతో భవిష్యత్‌ ఉన్న 25 ఏళ్ల రాధికా యాదవ్‌ను తండ్రి హత్య చేశాడు.  గురుగ్రామ్‌ సుశాంక్‌ లోక్‌ ఫేజ్‌-2లో నివాసముంటున్న రాధికా యాదవ్‌ను.. తండ్రి గన్‌తో కాల్చి చంపాడు. ఇన్‌ స్టా రీల్‌కు సంబంధించి తండ్రీ కూతుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇన్‌ స్టా రీల్‌ ఎందుకు చేశావని  ఆగ్రహించిన తండ్రి.. కూతుర్ని నిలదీశాడు. ఈ విషయంపై కూతురు ఎదురు తిరిగింది. దాంతో కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేని తండ్రి తన వద్ద ఉన్న గన్‌తో కాల్చి హత్య చేశాడు.

తన లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో కూతుర్ని తన ఇంటి వద్దే కాల్చి చంపాడు. కూతుర్ని చంపడమే లక్ష్యంగా మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దాంతో తీవ్ర గాయాల పాలై రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కూతుర్ని హత్య చేసిన విషయాన్ని తండ్రి అంగీకరించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.  లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 

టెన్నిస్‌ ఖేలో డాట్‌ కామ్‌ ప్రకారం అంతర్జాతీయ టెన్నిస్‌ ఫెడరేషన్‌ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో ఆమె 113వ స్థానంలో ఉంది.  2020, మార్చి 23వ తేదీన జన్మించిన రాధికా యాదవ్‌.. టెన్నిస్‌లో తన ఢవిష్యత్‌ను ఎతుక్కుంటూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చింది. ఈ క్రమంలో ఎన్నో పోటీల్లో విజేతగా నిలిచింది.  తన భవిష్యత్‌ను మరింత మెరుగులు దిద్దుకునే క్రమంలో తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోవడంపై దేశ వ్యాప్తంగా  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)