Martina Navratilova: మాజీ ఛాంపియన్‌కు ఒకేసారి రెండు క్యాన్సర్‌లు

Published on Tue, 01/03/2023 - 07:39

మియామి: టెన్నిస్‌ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా(66) మళ్లీ క్యాన్సర్‌ బారిన పడ్డారు. తాజాగా ఆమెకు గొంతు, రొమ్ము క్యాన్సర్‌ సోకినట్లు తాజాగా తేలింది. అది స్టేజ్‌ వన్‌లోనే ఉందని తెలుస్తోంది. అంటే ఆరంభ దశ అన్నమాట. మెడ దగ్గర చిన్నకణితి ఏర్పడడంతో వైద్య పరీక్షలు చేయించుకోవడంతో.. గొంతు క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌ ఉందని వెల్లడైంది. కాగా, నవ్రతిలోవా క్యాన్సర్‌ బారిన పడడం రెండోసారి.

తన కెరీర్‌లో 18 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిళ్లు గెలిచారు ఆమె. సింగిల్స్‌, డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌తో కలిపి గ్రాండ్‌స్లామ్‌లో మొత్తం 59 సార్లు ఛాంపియన్‌గా నిలిచారు. ప్రపంచ ఉత్తమ టెన్నిస్‌ క్రీడాకారుల్లో ఒకరైన మార్టినా నవ్రతిలోవాకు గతంలో రొమ్ము క్యాన్సర్‌ సోకగా.. ఆరు నెలల పాటు చికిత్స తీసుకుని కోలుకున్నారు. ‘‘ఒకేసారి రెండు రకాల క్యాన్సర్‌లు సోకడం తీవ్రమైన అంశమే. కానీ, చికిత్సతో జయించే అవకాశం ఉంది. ఫలితం సానుకూలంగా వస్తుందనే నమ్ముతున్నా. కొద్దికాలం హాస్పిటల్‌ వాసన భరించక తప్పదు. నా శక్తికొద్దీ పోరాడతా’’ అని 66 ఏళ్ల నవ్రతిలోవా తెలిపారు. 

2010లో క్యాన్సర్‌ బారిన పడినప్పుడు నిస్సహాయంగా మారనని, అందుకే ఇలాంటి సమస్యలను వెలుగులోకి తీసుకురావడం వల్ల తనలా బాధపడుతున్న మహిళలకు సహాయం చేయవచ్చని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. చెక్‌-అమెరికన్‌ అయిన నవ్రతిలోవా కుటుంబంతో ప్రస్తుతం ఫ్లోరిడా మియామీలో ఉంటున్నారు. త్వరలోనే ఆమె చికిత్స తీసుకుంటారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)