Breaking News

టీమిండియాతో రెండో టెస్టు.. సౌతాఫ్రికాకు మరో ఊహించని షాక్‌

Published on Sat, 12/30/2023 - 12:21

టీమిండియాతో రెండో టెస్టుకు ముందు దక్షిణాఫ్రికాకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్‌ టెంబా బావుమా సేవలను ప్రోటీస్‌ కోల్పోగా.. ఇప్పుడు యువ సంచలనం గెరాల్డ్ కోయిట్జీ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా వెల్లడించింది.  కోయిట్జీ ప్రస్తుతం కటి వాపుతో బాధపడుతున్నాడు.

ఈ క్రమంలో కేప్‌టౌన్‌ వేదికగా భారత్‌తో జరిగే రెండు టెస్టుకు దూరమయ్యాడని సౌతాఫ్రికా క్రికెట్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో పేర్కొంది. కాగా కోయిట్జీ తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే పడగొట్టాడు. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్‌, వన్డే వరల్డ్‌కప్‌లోనూ కోయిట్జీ అదరగొట్టాడు.

తనదైన రోజు ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించే సత్తా ఈ యువ పేసర్‌కు ఉంది. రెండో టెస్టుకు అతడి స్ధానంలో వియాన్‌ ముల్డర్‌ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. ఇక జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. కాగా సెంచూరియన్‌ వేదికగ జరిగిన తొలి టెస్టులో భారత్‌పై ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో ప్రోటీస్‌ విజయం సాధించింది.
చదవండి: IND Vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌!?

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)