Breaking News

పాయింట్‌ తేడాతో గట్టెక్కిన టైటాన్స్‌

Published on Wed, 09/24/2025 - 04:24

జైపూర్‌: ఈ సీజన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌–12)లో నిలకడగా రాణిస్తున్న తెలుగు టైటాన్స్‌ ఐదో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పాయింట్‌ తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై గట్టెక్కింది. తెలుగు టైటాన్స్‌ 30–29తో గుజరాత్‌ను ఓడించింది. టైటాన్స్‌ జట్టులో ఆల్‌రౌండర్‌ భరత్‌ రాణించాడు. 17 సార్లు కూతకెళ్లిన అతను 9 పాయింట్లు సాధించాడు. కెప్టెన్‌ విజయ్‌ మలిక్‌ (7) కూడా రాణించడంతో తెలుగు జట్టు క్రమం తప్పకుండా స్కోరు చేసింది. డిఫెండర్లలో శుభమ్‌ షిండే (4), అంకిత్‌ (3) ఆకట్టుకున్నారు. 

గుజరాత్‌ జట్టులో మొహమ్మద్‌ రెజా (6) అదరగొట్టాడు. ఇతనికి ఆర్యవర్ధన్‌ (4), విశ్వంత్‌ (3), అంకిత్‌ దహియా (3), లక్కీ శర్మ (2), రోహిత్‌ నందల్‌ (2) సమష్టిగా సహకరించారు. అనంతరం జరిగిన హోరాహోరీ పోరులో జైపూర్‌ పింక్‌పాంథర్స్‌ టైబ్రేక్‌లో యు ముంబాపై గెలుపొందింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరుజట్లు 38–38 స్కోరుతో సమంగా నిలిచాయి. దీంతో టైబ్రేక్‌ నిర్వహించగా జైపూర్‌ 6–4తో యు ముంబాపై పైచేయి సాధించింది. పింక్‌ పాంథర్స్‌ తరఫున రెయిడర్‌ నితిన్‌ కుమార్‌ (14) అదరగొట్టాడు. 

20 సార్లు కూతకెళ్లిన 14 పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతావారిలో డిఫెండర్లు రెజా మిర్‌బగేరి (4), ఆశిష్‌ కుమార్‌ (3) మెరుగ్గా ఆడారు. యు ముంబా జట్టులోనూ రెయిడర్‌ సందీప్‌ (14) ప్రత్యర్థి జట్టుకు దీటుగా రాణించాడు. కూతకెళ్లిన ప్రతీసారి జైపూర్‌ ఆటగాళ్లను వణికించాడు. డిఫెండర్లలో లోకేశ్‌ (4), అనిల్‌ (3), పర్వేశ్‌ (2), రింకూ (2) ఉమ్మడిగా పాయింట్లు సాధించారు. నేడు విశ్రాంతి రోజు కాగా... గురువారం జరిగే పోటీల్లో బెంగళూరు బుల్స్‌తో యూపీ యోధాస్, దబంగ్‌ ఢిల్లీతో యు ముంబా తలపడతాయి.   

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)