Breaking News

టైటాన్స్‌ గెలుపు

Published on Sat, 12/21/2024 - 04:01

పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌–11)లో తెలుగు టైటాన్స్‌ 12వ విజయాన్ని సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో టైటాన్స్‌ 48–36తో పుణేరి పల్టన్‌పై విజయం సాధించింది. తెలుగు టైటాన్స్‌ జట్టును కెప్టెన్, రెయిడర్‌ పవన్‌ సెహ్రావత్‌ ముందుండి నడిపించాడు. 16 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన కెపె్టన్‌ 11 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చాడు. 4 బోనస్‌ పాయింట్లు కలుపుకొని మొత్తం 15 పాయింట్లు సాధించాడు. స్టార్‌ రెయిడర్‌ ఆశిష్‌ నర్వాల్‌ (11) కూడా క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చాడు. 

డిఫెండర్లలో అంకిత్‌ (6), అజిత్‌ పవార్‌ (3) రాణించారు. పుణేరి జట్టులో రెయిడర్‌ అజిత్‌ (10 పాయింట్లు) అదరగొట్టాడు. సబ్‌స్టిట్యూట్‌గా ఆలస్యంగా మైదానంలోకి దిగిన అజిత్‌ 13 సార్లు కూతకెళ్లి 10 పాయింట్లు చేశాడు. మిగతా సహచరుల్లో రెయిడర్‌ ఆర్యవర్ధన్‌ నవలె (8), డిఫెండర్లు అమన్‌ (5), దాదాసో పూజారి (3) రాణించారు.

అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌పాంథర్స్‌ 31–28తో బెంగాల్‌ వారియర్స్‌పై గెలుపొందడంతో ప్లే ఆఫ్స్‌కు ఐదో జట్టుగా అర్హత సాధించింది. జైపూర్‌ జట్టులో కెప్టెన్, రెయిడర్లు అర్జున్‌ దేశ్వాల్‌ (9), అభిజిత్‌ మాలిక్‌ (7) నిలకడగా స్కోరు చేశారు. మిగతావారిలో డిఫెండర్లు రెజా మీర్‌బఘేరి (5), అంకుశ్‌ రాఠి (3) మెరుగ్గా ఆడారు. 

బెంగాల్‌ వారియర్స్‌ తరఫున రెయిడర్లు ప్రణయ్‌ (8), అర్జున్‌ రాఠి (7) ఆకట్టుకున్నారు. డిఫెండర్లలో వైభవ్‌ గార్జే 4 పాయింట్లు చేశాడు.  నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌... గుజరాత్‌ జెయంట్స్‌తో పోటీ పడనుండగా, దబంగ్‌ ఢిల్లీ... జైపూర్‌ పింక్‌పాంథర్స్‌తో తలపడుతుంది.   

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు