Breaking News

తెలుగు టైటాన్స్‌ గెలుపు బోణీ

Published on Fri, 09/05/2025 - 02:28

విశాఖ స్పోర్ట్స్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిన తెలుగు టైటాన్స్‌ జట్టు మూడో మ్యాచ్‌తో గెలుపు బోణీ చేసింది. గురువారం జరిగిన పోరులో టైటాన్స్‌ 37–32తో మాజీ చాంపియన్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ను ఓడించింది. టైటాన్స్‌ కెప్టెన్ విజయ్‌ మలిక్, ఆల్‌రౌండర్‌ భరత్‌ హుడా చెరో 8 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 

రెయిడర్‌ చేతన్‌ సాహు, డిఫెండర్‌ అజిత్‌ పవార్‌ కూడా చెరో 5 పాయింట్లు సాధించి సహకరించారు. జైపూర్‌ తరఫున నితిన్‌ కుమార్‌ (13 పాయింట్లు) ఒంటరి పోరాటం వృథా అయింది. మ్యాచ్‌ 13వ నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి ఆధిక్యం సాధించిన టైటాన్స్, పదునైన డిఫెన్స్‌తో తొలి అర్ధ భాగాన్ని 16–9తో ముగించింది. మరో పది నిమిషాల తర్వాత ఇది 23–16కు మారింది.

అయితే ఆ తర్వాత రెయిడర్‌ నితిన్‌ ఒక్కసారిగా చెలరేగి టైటాన్స్‌ను ఆలౌట్‌ చేయడంతో పాటు సూపర్‌ రెయిడ్‌ సాధించాడు. దాంతో చివరి మూడు నిమిషాల్లో అంతరం కేవలం మూడు పాయింట్లకు తగ్గి ఉత్కంఠ పెరిగింది. అయితే విజయ్‌ మలిక్‌ ఒత్తిడిని అధిగమించి రెండు పాయింట్లు రాబట్టడంతో టైటాన్స్‌ ఊపిరి పీల్చుకుంది.    

తొలిసారి గోల్డెన్‌ రెయిడ్‌లో గెలుపు 
పుణేరి పల్టన్, దబంగ్‌ ఢిల్లీ మధ్య హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో చివరకు ‘గోల్డెన్‌ రెయిడ్‌’ ద్వారా ఫలితం వచ్చింది. ఇందులో ఢిల్లీ విజేతగా నిలిచింది.  నిర్ణీత సమయంలో ఇరు జట్లు 28–28 పాయింట్లతో సమంగా నిలిచాయి. ఆ తర్వాత ‘టైబ్రేక్‌’లో కూడా స్కోరు 5–5తో సమంగానే ముగిసింది. అనంతరం ‘గోల్డెన్‌ రెయిడ్‌’ కోసం టాస్‌ నెగ్గిన ఢిల్లీ తరఫున అశు మలిక్‌ రెయిడింగ్‌కు వెళ్లి అద్భుతంగా 2 పాయింట్లు సాధించడంతో జట్టుకు గెలుపు దక్కింది. 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు