Breaking News

తెలుగు టైటాన్స్‌ గెలుపు

Published on Sun, 12/15/2024 - 04:12

పుణే: రెండు వరుస పరాజయాల తర్వాత తెలుగు టైటాన్స్‌ గెలుపుబాట పట్టింది. ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌–11)లో శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో టైటాన్స్‌ 36–32తో గుజరాత్‌ జెయంట్స్‌పై విజయం సాధించింది. స్టార్‌ రెయిడర్, కెప్టెన్‌ పవన్‌ సెహ్రావత్‌ (12 పాయింట్లు) కూతకెళ్లిన ప్రతీ సారి ప్రత్యర్థుల్ని హడలెత్తించాడు. 18 సార్లు రెయిడింగ్‌కు వెళ్లి 12 పాయింట్లు తెచ్చిపెట్టాడు. సహచర రెయిడర్‌ ఆశిష్‌ నర్వాల్‌ (6) కూడా రాణించాడు. ఆల్‌రౌండర్‌ విజయ్‌ మాలిక్‌ (18) అదరగొట్టాడు. 

ప్రథమార్ధం ముగిసే ఆఖరి నిమిషంలో గుజరాత్‌ ఒకసారి తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్‌ చేస్తే... ద్వితీయార్ధంలో పవన్, ఆశిష్, విజయ్‌లు చెలరేగడంతో ప్రత్యర్థి జట్టును స్వల్ప వ్యవధిలో రెండు సార్లు ఆలౌట్‌ చేసి మ్యాచ్‌ గెలిచింది. గుజరాత్‌ జట్టులో కెప్టెన్‌ గుమన్‌ సింగ్‌ (9), రాకేశ్‌ (10) రెయిడింగ్‌లో ఆకట్టుకున్నారు. అనంతరం జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సంపాదించిన హరియాణ స్టీలర్స్‌కు దబంగ్‌ ఢిల్లీ షాకిచ్చిoది. 

ఢిల్లీ జట్టు 44–37తో స్టీలర్స్‌పై గెలుపొందింది. రెయిడర్, ఢిల్లీ కెపె్టన్‌ అషు మాలిక్‌ (15) అద్భుతంగా రాణించాడు. అదేపనిగా పాయింట్లు తెచ్చిపెట్టాడు. సహచరుల్లో రెయిడర్‌ నవీన్‌ (7), డిఫెండర్లు యోగేశ్‌ (4), ఆశిష్‌ (5) రాణించారు. హరియాణా జట్టులో ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ రెజా (9), రెయిడర్‌ శివమ్‌ పతారే (6) ఆదుకున్నారు.

సంజయ్, నవీన్, వినయ్‌ తలా 3 పాయింట్లు చేశారు. జైదీప్, రాహుల్‌ చెరో 2 పాయింట్లు చేశారు. నేడు (ఆదవారం) జరిగే పోటీల్లో తమిళ్‌ తలైవాస్‌తో జైపూర్‌ పింక్‌పాంథర్స్‌... యు ముంబాతో యూపీ యోధాస్‌ తలపడుతుంది.  

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు