గుజరాత్‌పై తెలుగు టైటాన్స్‌ గెలుపు

Published on Mon, 10/20/2025 - 03:08

న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఆఖరి దశ పోటీల్లో తెలుగు టైటాన్స్‌ నిలకడగా రాణిస్తోంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టైటాన్స్‌ జట్టు 30–25 గుజరాత్‌ జెయింట్స్‌పై విజయం సాధించింది. టైటాన్స్‌ జట్టులో కెప్టెన్‌ విజయ్‌ మాలిక్‌ (8), భరత్‌ (7) పోటీపడి రాణించారు. ఇద్దరు ఆల్‌రౌండర్లు క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టారు. డిఫెండర్లు అజిత్‌ పవార్‌ (4), అంకిత్‌ (4)లు మెరుగ్గా ఆడారు. 

గుజరాత్‌ తరఫున రెయిడింగ్‌లో హిమాన్షు సింగ్‌ (6), కెప్టెన్‌ రాకేశ్‌ (5) రాణించగా, డిఫెండర్‌ లక్కీ శర్మ 4 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ రెజా (3), విశ్వనాథ్, నితిన్‌ పన్వార్‌ చెరో 2 పాయింట్లు చేశారు. 12వ సీజన్‌లో ఆరంభం నుంచే పట్టుదలగా ఆడుతున్న తెలుగు టైటాన్స్‌ 17 మ్యాచ్‌లాడి పదో విజయాన్ని నమోదు చేసింది.

నేడు మ్యాచ్‌లకు విశ్రాంతి రోజు. రేపు జరిగే పోటీల్లో బెంగాల్‌ వారియర్స్‌తో తమిళ్‌ తలైవాస్‌ పోటీపడుతుంది. యూ ముంబాను జైపూర్‌ పింక్‌పాంథర్స్‌ ఢీకొంటుంది. హరియాణా స్టీలర్స్‌తో గుజరాత్‌ జెయంట్స్‌ తలపడుతుంది.

ప్లేఆఫ్స్‌ చేరిన యూ ముంబా
లీగ్‌లో మరో జట్టు యూ ముంబా కూడా ప్లే ఆఫ్స్‌ చేరింది. హరియాణా స్టీలర్స్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో యూ ముంబా టై బ్రేకర్‌లో గెలిచి ముందంజ వేసింది. నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు 37–37 స్కోరుతో సమంగా నిలిచాయి. దీంతో టైబ్రేక్‌ అనివార్యం కాగా యూ ముంబా రెయిడర్లు జట్టును గెలిపించారు. సందీప్‌ (9) అదరగొట్టాడు. 21 సార్లు కూతకెళ్లిన అతను 9 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చాడు. 

సహచరుల్లో అజిత్‌ చౌహాన్‌ (6), అమిర్‌ మొహమ్మద్‌ (6), సునీల్‌ కుమార్‌ (4), విజయ్‌ కుమార్‌ (3) రాణించారు. హరియాణా జట్టులో జైదీప్‌ (9) కడదాకా శ్రమించాడు. మిగతావారిలో సాహిల్‌ నర్వాల్‌ (6), శివమ్‌ పతారే (4), వినయ్‌ (3), రాహుల్‌ (3) మెరుగ్గా ఆడారు. ఆఖరి మూడో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 38–27తో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)