Breaking News

పోరాడి ఓడిన తెలుగు టైటాన్స్‌

Published on Fri, 11/15/2024 - 04:10

నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌లో వరుసగా నాలుగు విజయాల తర్వాత తెలుగు టైటాన్స్‌ జట్టుకు పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్‌ 34–40 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌ జట్టు చేతిలో ఓటమి పాలైంది. టైటాన్స్‌ తరఫున విజయ్‌ మలిక్‌ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేయగా... కెప్టెన్ పవన్‌ సెహ్రావత్‌ 4 పాయింట్లు మాత్రమే సాధించాడు. యూపీ యోధాస్‌ తరఫున భవాని రాజ్‌పుత్‌ 12, భరత్‌ 11 పాయింట్లు సాధించారు. 

తాజా సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్‌ 5 విజయాలు, 4 పరాజయాలలతో 25 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు యూపీ యోధాస్‌ లీగ్‌లో నాలుగో మ్యాచ్‌ నెగ్గి 25 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో యు ముంబా 35–32 పాయింట్ల తేడాతో తమిళ్‌ తలైవాస్‌పై గెలుపొందింది. 

యు ముంబా తరఫున మన్‌జీత్‌ 10 పాయింట్లు, అజిత్‌ చవాన్‌ 8 పాయింట్లు సాధించగా... తలైవాస్‌ తరఫున మోయిన్‌ 10 పాయింట్లతో పోరాడాడు. 10 మ్యాచ్‌లాడి 6వ విజయం నమోదు చేసుకున్న యు ముంబా జట్టు 34 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరగా... వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓటమి పాలైన తమిళ్‌ తలైవాస్‌ 22 పాయింట్లతో పట్టికలో 10వ స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో బెంగాల్‌ వారియర్స్‌ (రాత్రి 8 గంటలకు), జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో గుజరాత్‌ జెయింట్స్‌ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.  

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు