Breaking News

టైటాన్స్‌ పరాజయాల ‘హ్యాట్రిక్‌’

Published on Sun, 10/27/2024 - 04:22

సాక్షి, హైదరాబాద్‌: సొంతగడ్డపై జరుగుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌ను విజయంతో మొదలుపెట్టిన తెలుగు టైటాన్స్‌ తర్వాత వరుసగా ఓడిపోతోంది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 37–41 స్కోరు తేడాతో దబంగ్‌ ఢిల్లీ చేతిలో కంగుతింది. తెలుగు టైటాన్స్‌కు వరుసగా ఇది మూడో ఓటమి. కెప్టెన్  పవన్‌ సెహ్రావత్‌ జట్టును గెలిపించేందుకు చక్కని పోరాటమే చేశాడు. 17 సార్లు కూతకెళ్లిన పవన్‌ 12 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చిపెట్టాడు. 

6 బోనస్‌ పాయింట్లు సహా మొత్తం 18 పాయింట్లు సాధించాడు. మరో రెయిడర్‌ ఆశిష్‌ నర్వాల్‌ (9) కూడా రాణించాడు. మిగతా వారిలో ఆల్‌రౌండర్‌ విజయ్‌ మాలిక్‌ 3, డిఫెండర్‌ సాగర్‌ 2 పాయింట్లు తెచ్చారు. అయితే ప్రత్యర్థి దబంగ్‌ ఢిల్లీ జట్టు తరఫున రెయిడర్లు కెపె్టన్‌ నవీన్‌ కుమార్, అశు మాలిక్‌ చెలరేగారు. ఇద్దరు చెరో 15 పాయింట్లతో జట్టు విజయానికి బాట వేశారు.

వీళ్లిద్దరు క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టడంతో తెలుగు టైటాన్స్‌ ఆఖరిదాకా పోరాడిన ఫలితం లేకపోయింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లాడిన టైటాన్స్‌ ఒక్క మ్యాచ్‌లో గెలిచి మూడింట ఓడింది. మూడు మ్యాచ్‌లాడిన ఢిల్లీ రెండో విజయం సాధించింది. ఆదివారం జరిగే పోటీల్లో జైపూర్‌ పింక్‌పాంథర్స్‌తో తమిళ్‌ తలైవాస్‌ పోటీపడుతుంది. యూపీ యోధాస్‌ను గుజరాత్‌ జెయింట్స్‌ ఢీకొంటుంది.  

బెంగాల్, యూ ముంబా మ్యాచ్‌ టై 
అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో యూ ముంబా, బెంగాల్‌ వారియర్స్‌ హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో ఈ మ్యాచ్‌ 31–31 స్కోరు వద్ద టై అయ్యింది. వారియర్స్‌ జట్టులో రెయిడర్‌ మణిందర్‌ సింగ్‌ (8 పాయింట్లు), డిఫెండర్‌ మయూర్‌ కదం (6) అదరగొట్టారు. 

ఒకరు కూతకెల్లి పాయింట్లు తెస్తుంటే మరొకరు ప్రత్యర్థి రెయిడర్లను టాకిల్‌ చేసి పాయింట్లు సాధించారు. మిగిలిన వారిలో నితీశ్‌ కుమార్‌ (4), సుశీల్‌ కాంబ్రేకర్‌ (3), నితిన్‌ ధన్కర్‌ (3), కెప్టెన్  ఫజల్‌ అత్రాచలి (3) మెరుగ్గా ఆడారు. యూ ముంబా జట్టులో రెయిడర్‌ మన్‌జీత్‌ (7 పాయింట్లు) ఆకట్టుకున్నాడు.  

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు