Breaking News

క్వాలిఫయర్‌–2కు తెలుగు టైటాన్స్‌

Published on Wed, 10/29/2025 - 02:20

న్యూఢిల్లీ: వరుస విజయాలతో విజృంభిస్తున్న తెలుగు టైటాన్స్‌ జట్టు ప్రొ కబడ్డీ లీగ్‌ 12వ సీజన్‌లో ఫైనల్‌కు విజయం దూరంలో నిలిచింది. మంగళవారం హోరాహోరీగా సాగిన ఎలిమినేటర్‌–3లో తెలుగు టైటాన్స్‌ 46–39 పాయింట్ల తేడాతో మూడుసార్లు చాంపియన్‌ పట్నా పైరేట్స్‌పై  నెగ్గింది. టైటాన్స్‌ తరఫున భరత్‌ హూడా 23 పాయింట్లతో మెరిశాడు.  పట్నా పైరేట్స్‌ తరఫున అయాన్‌ 22 పాయింట్లతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. 

ఈ సీజన్‌లో అయాన్‌ 20కి పైగా పాయింట్లు సాధించడం ఇది ఆరోసారి. తద్వారా ఒకే సీజన్‌లో అత్యధిక సార్లు 20కి పైగా పాయింట్లు సాధించిన రెయిడర్‌గా అయాన్‌ చరిత్ర సృష్టించాడు. పీకేఎల్‌ 12వ సీజన్‌లో అయాన్‌ 316 పాయింట్లు సాధించడం విశేషం. గత సీజన్‌లో 184 పాయింట్లు నమోదు చేసుకున్న అతడు... ఈసారి పట్నా పైరేట్స్‌ ఎలిమినేటర్‌–3 వరకు రావడంలో కీలక పాత్ర పోషించాడు. 

ఇరు జట్లు మ్యాచ్‌ను దూకుడుగా ఆరంభించగా... టైటాన్స్‌ 29 రెయిడ్‌ పాయింట్లు, పట్నా 27 రెయిడ్‌ పాయింట్లు సాధించాయి. ఇరు జట్లు రెండేసి సార్లు ఆలౌట్‌ కాగా... రెండేసి ఎక్స్‌ట్రా పాయింట్లు సాధించాయి. ట్యాక్లింగ్‌లో మెరుగ్గా నిలిచిన టైటాన్స్‌ ముందంజ వేసింది. నేడు జరిగే క్వాలిఫయర్‌–2లో పుణేరి పల్టన్‌తో తెలుగు టైటాన్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు శుక్రవారం ఫైనల్లో దబంగ్‌ ఢిల్లీతో టైటిల్‌ కోసం పోటీపడుతుంది.   

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)