Breaking News

ఆఖరి బెర్త్‌ యు ముంబాదే

Published on Wed, 12/25/2024 - 03:36

పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌ ఆరంభంలో వరుస విజయాలతో సత్తా చాటిన తెలుగు టైటాన్స్‌... ఆ తర్వాత పడుతూ లేస్తూ చివరకు గ్రూప్‌ దశతోనే పోరాటాన్ని ముగించింది. మంగళవారం ముగిసిన లీగ్‌ దశ చివరి మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ యు ముంబా 36–27 పాయింట్ల తేడాతో బెంగాల్‌ వారియర్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది. యు ముంబా జట్టు ఆఖరి పోరులో 48 పాయింట్ల తేడాతో ఓడిపోయి ఉంటే టైటాన్స్‌ ఆరో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేది. 

కానీ యు ముంబా విజయం సాధించడంతో తెలుగు టైటాన్స్‌ ఏడో స్థానంతో లీగ్‌ దశకే పరిమితమైంది. కీలక పోరులో ముంబా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. అమీర్‌ మొహమ్మద్‌ 7 పాయింట్లు, అజిత్‌ చవాన్‌ 6 పాయింట్లు, సునీల్‌ కుమార్‌ 5 పాయింట్లు సాధించారు. బెంగాల్‌ వారియర్స్‌ తరఫున ప్రణయ్‌ 12 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. 

తాజా సీజన్‌లో 22 మ్యాచ్‌లాడి 12 విజయాలు, 8 పరాజయాలు, 2 ‘టై’లతో 71 పాయింట్లు ఖాతాలో వేసుకున్న యు ముంబా జట్టు పట్టికలో ఐదో స్థానానికి చేరి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌ 44–30 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. యూపీ యోధాస్‌ తరఫున శివమ్‌ చౌధరీ 13 పాయింట్లు, సురేందర్‌ గిల్‌ 9 పాయింట్లతో రాణించారు. 

బెంగళూరు బుల్స్‌ తరఫున సుశీల్‌ 12 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. నేడు విశ్రాంతి రోజు. గురువారం జరగనున్న తొలి ఎలిమినేటర్‌లో యూపీ యోధాస్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్, రెండో ఎలిమినేటర్‌లో పట్నా పైరేట్స్‌తో యు ముంబా తలపడనున్నాయి.  

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)