Breaking News

తెలుగు టైటాన్స్‌ పరాజయం

Published on Thu, 10/16/2025 - 04:18

ఢిల్లీ: హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్‌ ‘టైబ్రేక్‌’లో పరాజయం పాలైంది. ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన పోరులో టైటాన్స్‌ 5–7 పాయింట్ల తేడాతో బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో ఓడింది. మొదట నిర్ణీత సమయంలో ఇరు జట్లు 45–45 పాయింట్లతో సమంగా నిలిచాయి. టైటాన్స్‌ తరఫున భరత్‌ 16 పాయింట్లతో సత్తా చాటగా... కెప్టెన్‌ విజయ్‌ మలిక్‌ 6 పాయింట్లు సాధించాడు. 

బెంగాల్‌ వారియర్స్‌ సారథి దేవాంక్‌ 18 పాయింట్లతో అదరగొట్టాడు. మన్‌జీత్‌ 7 పాయింట్లతో అతడికి అండగా నిలిచాడు. దీంతో ఫలితం తేల్చేందుకు ‘టైబ్రేక్‌’ నిర్వహించగా... బెంగాల్‌ వారియర్స్‌ మెరిపించింది. తాజా సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్‌ 8 విజయాలు, 6 పరాజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని మూడో స్థానంలో ఉంది. బెంగాల్‌ వారియర్స్‌ 14 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 9 ఓడి 10 పాయింట్లతో పట్టిక 11వ స్థానంలో నిలిచింది. 

మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌ 57–33 పాయింట్ల తేడాతో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై గెలుపొందింది. పల్టన్‌ తరఫున పంకజ్‌ 9, గౌరవ్‌ ఖత్రి 7 పాయంట్లు సాధించగా... వైభవ్, అస్లమ్‌ చెరో ఆరు పాయింట్లు సాధించారు. జైపూర్‌ తరఫున అలీ సమదీ 14 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన పల్టన్‌ 16 మ్యాచ్‌ల్లో 13 విజయాలు, 3 పరాజయాలతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకొని అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది. 

ఇంకో మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 42–35 పాయింట్ల తేడాతో తమిళ్‌ తలైవాస్‌పై గెలిచింది. గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున హిమాన్షు 13 పాయింట్లు సాధించగా... అంకిత్‌ దహియా, మొహమ్మద్‌ రెజా చెరో 6 పాయింట్లు సాధించారు. తలైవాస్‌ తరఫున అర్జున్‌ దేశ్వాల్‌ 12 పాయింట్లతో పోరాడాడు. లీగ్‌లో భాగంగా గురువారం మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. బెంగళూరు బుల్స్‌తో పట్నా పైరేట్స్, తెలుగు టైటాన్స్‌తో యు ముంబా, యూపీ యోధాస్‌తో హరియాణా స్టీలర్స్‌ తలపడనున్నాయి.  

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు