Breaking News

తెలుగు టైటాన్స్‌ పరాజయం

Published on Fri, 12/13/2024 - 03:59

పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ జట్టు ఖాతాలో మరో పరాజయం చేరింది. గురువారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్‌ 27–33 పాయింట్ల తేడాతో దబంగ్‌ ఢిల్లీ చేతిలో ఓడింది. టైటాన్స్‌ తరఫున విజయ్‌ మలిక్‌ 10 పాయింట్లు, ఆశిష్‌ నర్వాల్‌ 8 పాయింట్లు సాధించారు. దబంగ్‌ ఢిల్లీ తరఫున స్టార్‌ రెయిడర్‌ నవీన్‌ కుమార్‌ 11 పాయింట్లతో రాణించగా... ఆశు మలిక్‌ 9 పాయింట్లతో అతడికి సహకరించాడు.

ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 21 రెయిడ్‌ పాయింట్లు సాధించగా... టైటాన్స్‌ 20 రెయిడ్‌ పాయింట్లు సాధించింది. అయితే టైటాన్స్‌ రెండుసార్లు ఆలౌటై... ప్రత్యర్థి కి 4 పాయింట్లు సమర్పించుకోగా... ఢిల్లీ జట్టు ఒకేసారి ఆలౌటైంది. తాజా సీజన్‌లో 19 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్‌ 10 విజయాలు, 9 పరాజయాలతో 55 పాయింట్లు ఖాతాలో వేసుకొని ఆరో స్థానంలో నిలవగా... దబంగ్‌ ఢిల్లీ 18 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 5 పరాజయాలు, 4 ‘టై’లతో 61 పాయింట్లు సాధించి రెండో స్థానానికి ఎగబాకింది. 

యూపీ యోధాస్, బెంగాల్‌ వారియర్స్‌ మధ్య జరిగిన మరో మ్యాచ్‌ 31–31 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. యూపీ యోధాస్‌ తరఫున గగన్‌ గౌడ 11 పాయింట్లతో రాణించగా... బెంగాల్‌ వారియర్స్‌ తరఫున ప్రణయ్‌ 10 పాయింట్లతో సత్తాచాటాడు. 

పాయింట్ల పట్టికలో యూపీ యోధాస్‌ (59 పాయింట్లు) నాలుగో స్థానానికి చేరగా... బెంగాల్‌ వారియర్స్‌ (40 పాయింట్లు) 9వ స్థానంలో ఉంది. శుక్రవారం జరగనున్న మ్యాచ్‌ల్లో తమిళ్‌ తలైవాస్‌తో పట్నా పైరెట్స్‌ (రాత్రి 8 గంటలకు), పుణేరి పల్టన్‌తో బెంగళూరు బుల్స్‌ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.  

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు