Breaking News

మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌

Published on Fri, 10/17/2025 - 04:45

న్యూఢిల్లీ: ప్లేఆఫ్స్‌ రేసులో ఉన్న తెలుగు టైటాన్స్‌కు వరుస పరాజయాలు కుంగదీస్తున్నాయి. టైబ్రేక్‌కు దారితీసిన గత మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో ఓడిన తెలుగు టైటాన్స్‌ గురువారం జరిగిన పోరులో యు ముంబా చేతిలో 26–33తో పరాజయం పాలైంది. టైటాన్స్‌ జట్టులో ఆల్‌రౌండర్, కెప్టెన్ విజయ్‌ మలిక్‌ (10) ఒంటరి పోరాటం చేశాడు. రెయిడింగ్‌లో 17 సార్లు కూతకెళ్లి 9 పాయింట్లు తెచ్చాడు. 

ప్రత్యర్థి రెయిడర్‌ను టాకిల్‌ చేసి మరో పాయింట్‌ సాధించాడు. సహచరుల్లో భరత్‌ (5) మాత్రమే మెరుగ్గా ఆడాడు. డిఫెండర్లు అంకిత్‌ 3, అవి దుహన్, శుభమ్‌ షిండే చెరో 2 పాయింట్లు చేశారు. యు ముంబా తరఫున రెయిడర్‌ అజిత్‌ చౌహాన్‌ (8) రాణించాడు. ఇతనికి సహచరులు సందీప్‌ (4), రింకూ (4), అమిర్‌ మొహమ్మద్‌ (3), పర్వేశ్‌ (3)లను చక్కని సహకారం లభించింది. 

ప్రస్తుతం 8 విజయాలతో మూడో స్థానంలో ఉన్న తెలుగు టైటాన్స్‌కు ఈ సీజన్‌లో ఇక మూడే మ్యాచ్‌లు మిగిలున్నాయి. టైటాన్స్‌ రేపు పుణేరి పల్టన్‌తో పోటీపడుతుంది. అనంతరం 19న గుజరాత్, 22న ఆఖరి పోరులో హరియాణా స్టీలర్స్‌తో తలపడుతుంది. 

పాట్నా , హరియాణా గెలుపు 
అంతకుముందు హోరాహోరీగా జరిగిన తొలి మ్యాచ్‌లో మూడుసార్లు చాంపియన్‌ అయిన పట్నా పైరేట్స్‌ టైబ్రేక్‌లో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరుజట్లు 32–32 స్కోరుతో సమంగా నిలిచాయి. టైబ్రేక్‌లో పట్నా 6–5తో పైచేయి సాధించింది. పట్నా కెపె్టన్‌ అయాన్‌ రెయిడింగ్‌లో చెలరేగాడు. 20 సార్లు కూతకెళ్లిన అతను 14 సార్లు పాయింట్లతో వచ్చాడు. మిగతా వారిలో రెయిడర్‌ అంకిత్‌ కుమార్‌ (5), డిఫెండర్‌ నవ్‌దీప్‌ (4) రాణించారు. 

బెంగళూరు బుల్స్‌ తరఫున అలీ రెజా మీర్జాయిన్‌ (17) ఒక్కడే శ్రమించాడు. అనంతరం జరిగిన మూడో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 53–26తో యూపీ యోధాస్‌పై ఘన విజయం సాధించింది. స్టీలర్స్‌ జట్టులో శివమ్‌ (15), జైదీప్‌ (6), సాహిల్‌ నర్వాల్‌ (4) రాణించారు. యూపీ తరఫు గగన్‌ గౌడ (7), భవానీ రాజ్‌పుత్, హితేశ్‌ చెరో 3 పాయింట్లు చేశారు. నేటి మ్యాచ్‌ల్లో బెంగాల్‌ వారియర్స్‌తో పట్నా పైరేట్స్, తమిళ్‌ తలైవాస్‌తో దబంగ్‌ ఢిల్లీ, జైపూర్‌ పింక్‌పాంథర్స్‌తో యూపీ యోధాస్‌ తలపడతాయి.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)