Breaking News

మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌

Published on Thu, 09/18/2025 - 04:01

జైపూర్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌కు ‘హ్యాట్రిక్‌’ పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన తొలి పోరులో టైటాన్స్‌ 29–33 పాయింట్ల తేడాతో దబంగ్‌ ఢిల్లీ చేతిలో ఓడింది. టైటాన్స్‌కు ఇది వరుసగా మూడో పరాజయం కాగా... ఆడిన ఆరో మ్యాచ్‌లోనూ గెలిచిన దబంగ్‌ ఢిల్లీ 12 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. లీగ్‌లో భాగంగా వైజాగ్‌లో ‘హ్యాట్రిక్‌’ విజయాలు నమోదు చేసుకున్న తెలుగు టైటాన్స్‌ జట్టు... పోటీలు జైపూర్‌కు తరలిన తర్వాత ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. 

తాజా పోరులో టైటాన్స్‌ తరఫున కెప్టెన్  విజయ్‌ మలిక్‌ 5 పాయింట్లు సాధించగా... మన్‌జీత్, అజిత్‌ పవార్‌ చెరో 4 పాయింట్లు సాధించారు. మరోవైపు దబంగ్‌ ఢిల్లీ తరఫున నీరజ్‌ నర్వాల్‌ 9 పాయింట్లు సాధించగా... సౌరభ్, ఫజల్‌ ఐదేసి పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో టైటాన్స్‌ 13 రెయిడ్‌ పాయింట్లు సాధించగా... ఢిల్లీ 15 ఖాతాలో వేసుకుంది. ట్యాక్లింగ్‌లో టైటాన్స్‌కు 12 పాయింట్లు దక్కగా... ఢిల్లీ 15 పాయింట్లతో ముందంజ వేసింది. 

తాజా సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన టైటాన్స్‌ 3 విజయాలు, 5 పరాజయాలతో ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 8వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్‌ 43–32 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్‌పై గెలుపొందింది. హర్యానా తరఫున శివమ్‌ 15 పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. పట్నా పైరెట్స్‌ తరఫున అయాన్‌ 7 పాయింట్లతో పోరాడాడు. లీగ్‌లో భాగంగా గురువారం జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో బెంగాల్‌ వారియర్స్, యు ముంబాతో పుణేరి పల్టన్‌ ఆడతాయి.   

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు