Breaking News

అదరగొట్టిన తెలుగు టైటాన్స్‌

Published on Mon, 10/27/2025 - 04:42

న్యూఢిల్లీ: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటుతున్న తెలుగు టైటాన్స్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌లో ట్రోఫీ చేజిక్కించుకునే దిశగా మరో అడుగు వేసింది. ఈ సీజన్‌ ఆసాంతం నిలకడగా రాణిస్తున్న టైటాన్స్‌... ఆదివారం జరిగిన మినీ క్వాలిఫయర్‌లో 37–32 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. దీంతో తెలుగు టైటాన్స్‌ ఎలిమినేటర్‌–3కి చేరింది. మంగళవారం జరగనున్న ఆ మ్యాచ్‌లో ఎలిమినేటర్‌–2 విజేతతో టైటాన్స్‌ తలపడుతుంది. కీలక పోరులో కెప్టెన్  విజయ్‌ మలిక్‌ 10 పాయింట్లతో, భరత్‌ 12 పాయింట్లతో మెరిశారు. 

బెంగళూరు బుల్స్‌ తరఫున అలీ రెజా 11 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఆదివారమే జరిగిన ఎలిమినేటర్‌–1 లో పట్నా పైరేట్స్‌ 48–32తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై గెలుపొందింది. పట్నా రైడర్‌ అయాన్‌ 20 పాయింట్లతో విజృంభించాడు. అయాన్‌కు ఇది ఐదో సూపర్‌–20 స్కోరు కావడం విశేషం. 

పీకేఎల్‌ చరిత్రలో ప్రదీప్‌ నర్వాల్, దేవాంక్‌ దలాల్‌ మాత్రమే ఐదు కంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో 20 పాయింట్ల చొప్పున సాధించారు. ఈ విజయంతో పట్నా ఎలిమినేటర్‌–2కు అర్హత సాధించింది. నేడు లీగ్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పుణేరి పల్టన్, దబంగ్‌ ఢిల్లీ క్వాలిఫయర్‌–1లో తలపడనున్నాయి. పట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్‌ జట్లు ఎలిమినేటర్‌–2లో ఆడతాయి.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)