Breaking News

తెలుగు టైటాన్స్‌దే పైచేయి

Published on Fri, 11/22/2024 - 04:11

నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో తెలుగు టైటాన్స్‌ ‘హ్యాట్రిక్‌’ విజయాలతో పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. గురువారం జరిగిన పోరులో టైటాన్స్‌ 31–29తో బెంగాల్‌ వారియర్స్‌ పై నెగ్గింది. కెప్టెన్  విజయ్‌ మలిక్‌ (14 పాయింట్లు) అద్భుతంగా రాణించాడు. మ్యాచ్‌ కీలక దశలో రెయిడింగ్‌కు వెళ్లిన విజయ్‌ మూడు పాయింట్లు తెచ్చిపెట్టడం టైటాన్స్‌ విజయానికి కారణమైంది. డిఫెన్స్‌లోనూ తెలుగు జట్టు ప్రత్యర్థిపై పైచేయి సాధించేలా చేసింది. 

ఆల్‌రౌండర్‌ శంకర్‌ గడాయ్, డిఫెండర్‌ అంకిత్, రెయిడర్‌ మన్‌జీత్‌ తలా 3 పాయింట్లు సాధించారు. వారియర్స్‌ తరఫున రెయిడర్‌ ప్రణయ్‌ రాణే (9) అదరగొట్టాడు. తొలి అర్ధభాగాన్ని 19–9తో టైటాన్స్‌ ముగించగా... ద్వితీయార్ధంలో ప్రణయ్‌ క్రమంగా తెచ్చిపెట్టిన పాయింట్లతో రేసులోకి వచ్చింది. మిగతా వారిలో హేమరాజ్, విశ్వాస్‌ చెరో 4 పాయింట్లు చేశారు. అయితే తెలుగు కెప్టెన్‌ విజయ్‌ మలిక్‌ చేసిన పోరాటంతో విజయం దక్కింది. 

అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 32–26తో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. స్టీలర్స్‌ జట్టులో రెయిడర్‌ వినయ్‌ (12) ఆకట్టుకున్నాడు. మిగతా వారిలో ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ రెజా 4, రెయిడర్‌ శివమ్‌ 5, డిఫెండర్‌ సంజయ్‌ 4 పాయింట్లు చేశారు. బుల్స్‌ జట్టులో ఒక్క అక్షిత్‌ (7) మాత్రమే నిలకడగా స్కోరు చేశాడు. స్టార్‌ రెయిడర్, కెప్టెన్‌ ప్రదీప్‌ నర్వాల్‌ (1) ఆకట్టుకోలేకపోయాడు. నితిన్‌ రావల్‌ (4), జై భగవాన్‌ (3) మెరుగ్గా ఆడారు. 

ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన హరియాణా 9 విజయాలతో టాప్‌లో నిలువగా, 12 మ్యాచ్‌ల్లో ఎనిమిది గెలిచిన టైటాన్స్‌ రెండో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్‌ తలైవాస్‌తో యూపీ యోధాస్‌ (రాత్రి 8 గంటలకు), జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో దబంగ్‌ ఢిల్లీ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.   

Videos

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)