Breaking News

అదరగొట్టిన తెలుగు టైటాన్స్‌

Published on Sat, 10/19/2024 - 03:35

సాక్షి, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ను తెలుగు టైటాన్స్‌ జట్టు విజయంతో మొదలు పెట్టింది. లీగ్‌లో ప్రతీ సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన టైటాన్స్‌ ఈసారి శుభారంభం చేసింది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 37–29 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్‌ బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. 

టైటాన్స్‌ తరఫున కెప్టెన్ పవన్‌ సెహ్రావత్‌ 13 పాయింట్లతో జట్టును ముందుండి నడిపించగా ... బెంగళూరు కెపె్టన్‌ ప్రదీప్‌ నర్వాల్‌ కేవలం 3 పాయింట్లే నమోదు చేసి విఫలం కావడం జట్టును దెబ్బ తీసింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్‌ 20–11తో 9 పాయింట్ల తేడాతో ముందంజలో నిలిచింది. అయితే ఆ తర్వాత కోలుకున్న బుల్స్‌ 18–11 పాయింట్లతో రెండో అర్ధభాగంలో ఆధిక్యం ప్రదర్శించింది. 

బుల్స్‌ తమ ప్రత్యర్థిని ఒకసారి ఆలౌట్‌ చేయగా... టైటాన్స్‌ జట్టు బెంగళూరును రెండుసార్లు ఆలౌట్‌ చేసింది. పవన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌లో 1200 రైడింగ్‌ పాయింట్లు పూర్తి చేసుకున్నాడు. రెండో మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ జట్టు 36–28 పాయింట్ల తేడాతో యు ముంబా జట్టును ఓడించింది. 

ఢిల్లీ తరఫున అశు మలిక్‌ 10 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్‌ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్‌ (రాత్రి 8 గంటల నుంచి), పుణేరి పల్టన్‌తో హరియాణా స్టీలర్స్‌ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి.   

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)