Breaking News

వెల్‌డన్‌... సుదర్శన్‌

Published on Fri, 01/24/2025 - 04:01

అబాకో క్లబ్‌ (బహామస్‌): కెనడాకు చెందిన తెలుగు సంతతి గోల్ఫర్‌ ఎల్లమరాజు సుదర్శన్‌ తన కెరీర్‌లో గొప్ప విజయం అందుకున్నాడు. ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ (పీజీఏ)లో ద్వితీయ శ్రేణి ఈవెంట్‌గా పరిగణించబడే కోర్న్‌ ఫెర్రీ టూర్‌లో భాగంగా జరిగిన బహామస్‌ గ్రేట్‌ అబాకో క్లాసిక్‌ టోర్నమెంట్‌లో సుదర్శన్‌ విజేతగా నిలిచాడు. 23 ఏళ్ల సుదర్శన్‌ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో జన్మించాడు. 

నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులతో పాటు అతను కెనడాకు వెళ్లి అక్కడేస్థిరపడ్డాడు. కాగా బహామస్‌ టోర్నీలో అసామాన ప్రదర్శనతో సుదర్శన్‌ ఆకట్టుకున్నాడు. కచ్చితత్వంతో కూడిన షాట్లతో విజయం సాధించాడు. కేవలం ఐదే ఐదు షాట్లలో విజేతగా నిలిచాడు. 8–అండర్‌–64లో 263 పాయింట్ల స్కోరుతో టైటిల్‌ నెగ్గాడు. 

ద్వితీయ శ్రేణి ఈవెంట్‌ అయినప్పటికీ అనామక ఆటగాళ్లు బరిలోకి దిగారనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఎందుకంటే రెండు సార్లు పీజీఏ టూర్‌ విజేత, జపాన్‌ స్టార్‌ గోల్ఫర్‌ కెన్సెయ్‌ హిరాత ఇక్కడ టైటిల్‌ కోసం శ్రమించినప్పటికీ సుద ర్శన్‌ ప్రదర్శనతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ‘కాలక్షేపం కోసం నాన్న టీవీలో గోల్ఫ్‌ పోటీలను చూసేవాడు. పక్కనే నేను కూ ర్చునేవాణ్ని. 

అలా చిరుప్రాయంలో చూసిన ఆటలో ఇప్పుడు విజేతగా నిలువడం... అది కూడా నాన్న పుట్టిన రోజు (జనవరి 22)న టైటిల్‌ అందుకోవడం ఆనందంగా ఉంది. అప్పట్లో మేం కెనడాకు వలస వెళ్లినపుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. తర్వాత పరి స్థితులు చక్కబడ్డాక అమ్మనాన్నలిద్దరూ నన్ను ప్రోత్సహించారు’ అని సుదర్శన్‌ అన్నాడు. 

#

Tags : 1

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)