Breaking News

National games: తెలంగాణకు 2 కాంస్యాలు

Published on Fri, 02/14/2025 - 10:16

డెహ్రాడూన్‌: జాతీయ క్రీడల్లో గురువారం తెలంగాణ రాష్ట్రానికి రెండు పతకాలు లభించాయి. నెట్‌బాల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో తెలంగాణ జట్టుకు కాంస్య పతకం దక్కగా... షూటింగ్‌ మిక్స్‌డ్‌ స్కీట్‌ టీమ్‌ ఈవెంట్‌లో బత్తుల మునేక్‌–రష్మీ రాథోడ్‌ జోడీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

నెట్‌బాల్‌లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ జట్ల మధ్య జరిగిన కాంస్య పతకం మ్యాచ్‌ 31–31 పాయింట్లతో ‘డ్రా’గా ముగిసింది. దాంతో రెండు జట్లకు కాంస్య పతకాలు ఖరారయ్యాయి. తెలంగాణ నెట్‌బాల్‌ జట్టు తరఫున బోడ విక్రమ్‌ రెడ్డి, అబ్దుల్‌ ఖాన్, అబ్దుల్‌ షరీఫ్, మొహమ్మద్‌ ఖాజాయుద్దీన్, శ్రవణ్‌ కుమార్, రఘునందన్, పులి రితిక రెడ్డి, గేయశ్రీ, శ్రుతి, గోపీ చంద్రిక, ముద్దం కీర్తన, సంహిత ప్రాతినిధ్యం వహించారు.

షూటింగ్‌ మిక్స్‌డ్‌ స్కీట్‌ ఫైనల్లో ఆరు జోడీలు పోటీపడ్డాయి. 138 పాయింట్లతో ఇషాన్‌ సింగ్‌–రైజా ధిల్లాన్‌ (హరియాణా) జంట స్వర్ణం దక్కించుకోగా...  భవతేజ్‌ సింగ్‌–గనీమత్‌ సెఖోన్‌ (పంజాబ్‌) ద్వయం రజతం సంపాదించింది. 133 పాయింట్లతో మునేక్‌–రష్మీ జంటకు కాంస్యం లభించింది. గురువారం పోటీలు ముగిశాక తెలంగాణ 18 పతకాలతో (3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్యాలు) 26వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ 14 పతకాలతో (7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 18వ స్థానంలో కొనసాగుతోంది.    

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)