Breaking News

అంతర్జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో స్వర్ణం గెలిచిన తెలంగాణ అమ్మాయి

Published on Sun, 08/20/2023 - 17:03

సాక్షి, జగిత్యాల: అంతర్జాతీయ స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో తెలంగాణ అమ్మాయి రంగు విరించి స్వప్నిక స్వర్ణంతో మెరిసింది. షార్జాలో జరిగిన ఏషియన్ యూనివర్సిటీ కప్‌ టోర్నీలో స్వప్నిక ఈ ఘనత సాధించింది.

జగిత్యాల జిల్లాలోని ధర్మపురికి చెందిన స్వప్నిక.. జూన్‌ నెలలో రాంచీలో జరిగిన ఆల్‌ ఇండియా యూనివర్సిటీ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చి ఏషియన్‌ యూనివర్సిటీ పోటీలకు ఎంపికైంది.

ఈ పోటీల్లో ఇండియా తరపున మొత్తం ఐదుగురు పాల్గొనగా.. స్క్వాడ్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ అనే మూడు విభాగాల్లో స్వప్నిక సత్తా చాటింది. మూడు విభాగాల్లో వేర్వేరుగా గోల్డ్ మెడల్స్ సాధించడంతో పాటు క్లాసిక్ పవర్ లిఫ్టింగ్‌లోనూ (మూడు కలిపి) గోల్డ్ మెడల్ సాధించింది. స్వప్నిక ఈ ఫీట్ సాధించడంపై ఆమె తండ్రి రంగు వెంకటరమణతో పాటక కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై స్వప్నిక స్వర్ణం సాధించడంతో ధర్మపురి వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వప్నిక స్ధానిన ఎస్సారార్‌ కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)