Breaking News

విజేత అర్జున్‌... రన్నరప్‌ సరయు

Published on Thu, 09/26/2024 - 04:00

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ జూనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు ఆదిరెడ్డి అర్జున్, వేల్పుల సరయు అదరగొట్టారు. హరియాణాలోని కర్నాల్‌ పట్టణంలో జరిగిన ఈ టోరీ్నలో ఓపెన్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆదిరెడ్డి అర్జున్‌ టైటిల్‌ను నిలబెట్టుకోగా... వరంగల్‌ జిల్లాకు చెందిన సరయు రన్నరప్‌గా నిలిచింది. 

నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 14 ఏళ్ల అర్జున్‌ 9.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అర్జున్‌ 8 గేముల్లో గెలిచి, 3 గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని టోర్నీని అజేయంగా ముగించాడు. సౌరత్‌ బిశ్వాస్‌ (పశ్చిమ బెంగాల్‌; 8.5 పాయింట్లు) రెండో స్థానంలో, జైవీర్‌ మహేంద్రు (మహారాష్ట్ర; 8.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు. 

బాలికల విభాగంలో సరయు నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 9 పాయింట్లతో మృతిక మల్లిక్‌ (పశ్చిమ బెంగాల్‌)తో కలిసి సంయుక్తంగా టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. అయితే చాంపియన్‌ను నిర్ణయించేందుకు మైరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. 

మెరుగైన టైబ్రేక్‌ స్కోరుతో మృతిక టైటిల్‌ సొంతం చేసుకోగా... సరయుకు రెండో స్థానంతో రన్నరప్‌ ట్రోఫీ దక్కింది. సరయు తొమ్మిది గేముల్లో గెలిచి, రెండు గేముల్లో ఓడిపోయింది. విజేత అర్జున్, రన్నరప్‌ సరయులను తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం అధ్యక్షుడు కేఎస్‌ ప్రసాద్‌ అభినందించారు.   

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)