Breaking News

ఆర్చరీలో చికితకు రజతం

Published on Sat, 11/29/2025 - 03:32

జైపూర్‌: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ (కేఐయూజీ)లో తెలంగాణ ఆర్చర్‌ తానిపర్తి చికిత రజత పతకంతో మెరిసింది. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో చికిత ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఈ క్రీడల్లో చికిత లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ తరఫున బరిలోకి దిగింది. టోర్నీ ఆసాంతం రాణించిన తెలంగాణ ఆర్చర్‌ ఫైనల్లో ప్రపంచ చాంపియన్‌ అదితి గోపీచంద్‌ స్వామి (శివాజీ యూనివర్సిటీ) చేతిలో ఓడి రజత పతకం కైవసం చేసుకుంది. 

శుక్రవారం జరిగిన ఫైనల్లో చికిత 143–147తో అదితి చేతిలో పోరాడి ఓడింది. ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో పసిడి నెగ్గిన అదితి... ఇక్కడ కూడా అదే జోరు కనబర్చింది. మధుర (కరమ్‌వీర్‌ పాటిల్‌ యూనివర్సిటీ)కు కాంస్య పతకం దక్కింది. కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో చికిత ప్రాతినిధ్యం వహించిన లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీకి స్వర్ణ పతకం దక్కగా... గురు కాశీ యూనివర్సిటీ రజతం, పంజాబ్‌ యూనివర్సిటీ కాంస్యం గెలుచుకున్నాయి. 

స్విమ్మింగ్‌లో ఒలింపియన్‌ శ్రీహరి నటరాజన్‌ తొమ్మిది పసిడి పతకాలతో సత్తాచాటాడు. రాజస్తాన్‌లోని పలు నగరాల్లో జరుగుతున్న ఈ క్రీడల్లో 222 యూనివర్సిటీలకు చెందిన 4448 మంది అథ్లెట్లు 23 క్రీడాంశాల్లో పోటీపడుతున్నారు. ఐదో రోజు పోటీలు ముగిసేసరికి జైన్‌ యూనివర్సిటీ 45 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. స్విమ్మింగ్‌లోనే 27 స్వర్ణాలు, 9 రజతాలు, 9 కాంస్యాలు సాధించింది. లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ 22 స్వర్ణాలతో రెండో స్థానంలో ఉంది.   

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి