Breaking News

పెళ్లి చేసుకున్న టీమిండియా యువ పేసర్‌.. అమ్మాయి ఎవరంటే?

Published on Wed, 11/29/2023 - 11:44

టీమిండియా యువ పేసర్‌ ముఖేష్‌ ​కుమార్‌ ఓ ఇంటివాడయ్యాడు. బీహార్‌కు చెందిన తన చిన్ననాటి స్నేహితురాలు దివ్య సింగ్‌ను ముఖేష్‌ వివాహమాడాడు. వీరిద్దరి పెళ్లి గోరఖ్‌పూర్‌లో ఓ హోటల్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. వీరి వివాహనికి పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. డిసెంబర్‌ 4న గోరఖ్‌పూర్‌లో ముఖేష్‌-దివ్య వివాహ రిసెప్షన్‌ జరగనుంది.

 

ఈ క్రమంలోనే మంగళవారం గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20కు ముఖేష్‌ దూరమయ్యాడు. ఈ విషయాన్ని మూడో టీ20 ఆరంభానికి ముందు బీసీసీఐ వెల్లడించింది. ముఖేష్‌ తిరిగి మళ్లీ శుక్రవారం రాయ్‌పూర్‌ వేదికగా జరగనున్న నాలుగో టీ20కు ముందు జట్టుతో కలవనున్నాడు. తొలి రెండు టీ20ల్లో ముఖేష్‌ అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శరన కనబరిచాడు.

కాగా ముఖేష్‌ ​కుమార్‌ ఏడాదిలోనే టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలోనూ అరేంగ్రం చేయడం గమనార్హం. ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్‌ పర్యటనలో వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో భారత్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ముఖేష్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌-2022 వేలంలో అతడిని రూ. 5 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది.


 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)