Breaking News

వచ్చే ఏడాదీ ఇంగ్లండ్‌కు టీమిండియా

Published on Fri, 07/25/2025 - 04:23

మాంచెస్టర్‌: ప్రస్తుతం భారత క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌లో బిజీ షెడ్యూల్‌లో నిమగ్నమైంది. ఐదు టెస్టుల పూర్తిస్థాయి ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొంటోంది. అయితే వచ్చే ఏడాది కూడా టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుంది. పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడుతుంది. గురువారం ఈ మేరకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది. వచ్చే ఏడాది ఐదు టి20లతో పాటు మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ పాల్గొంటుంది. 

ఈసీబీ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. మొదట జూలై 1న డర్హమ్‌లో జరిగే తొలి టి20తో పొట్టి సిరీస్‌ మొదలవుతుంది. రెండో మ్యాచ్‌ 4న మాంచెస్టర్‌లో, మూడో మ్యాచ్‌ 7న నాటింగ్‌హామ్‌లో, నాలుగో పోరు 9న బ్రిస్టల్‌లో, ఆఖరి పోరు 11న సౌతాంప్టన్‌లో జరుగనుంది. తర్వాత జూలై 14న బర్మింగ్‌హామ్, 16న కార్డిఫ్, 19న లార్డ్స్‌లలో మూడు వన్డేలు జరుగుతాయి. 

భారతే కాదు న్యూజిలాండ్, పాకిస్తాన్‌లతో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లతో ఇంగ్లండ్‌ 2026 సీజన్‌ అసాంతం బిజీ బిజీగా గడపనుంది. ఈ ఏడాది ఇంగ్లండ్‌లో టి20, వన్డే సిరీస్‌లను నెగ్గిన భారత మహిళల జట్టు కూడా అక్కడికి వెళ్లనుంది. మూడు టి20లు, ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. మే 28, 30, జూన్‌ 2 తేదీల్లో చెమ్స్‌ఫోర్డ్, బ్రిస్టల్, టాంటన్‌ వేదికల్లో పొట్టి మ్యాచ్‌లు ఆడుతుంది. జూలై 10 నుంచి లార్డ్స్‌ లో ఏకైక టెస్టు ఆడుతుంది.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)