Breaking News

చైనాపై భారత్‌దే పైచేయి

Published on Mon, 12/16/2024 - 02:59

మస్కట్‌: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత మహిళల హాకీ జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుసగా రెండోసారి జూనియర్‌ ఆసియా కప్‌ చాంపియన్‌గా టీమిండియా నిలిచింది. మూడుసార్లు చాంపియన్‌ చైనా జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో జ్యోతి సింగ్‌ నాయకత్వంలోని భారత జట్టు ‘షూటౌట్‌’లో 3–2 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఫలితంగా విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్‌’ నిర్వహించారు. 

‘షూటౌట్‌’లో భారత్‌ తరఫున సాక్షి రాణా, ఇషిక, సునెలిత టొప్పో సఫలమయ్యారు. ముంతాజ్‌ ఖాన్, కనిక సివాచ్‌ విఫలమయ్యారు. చైనా తరఫున గువోటింగ్‌ హావో, లియు టాంగ్జీ సఫలంకాగా...  వాంగ్‌ లిహాంగ్, లి జింగీ, దన్‌దన్‌ జువో విఫలమయ్యారు. ముగ్గురు చైనా ప్లేయర్ల షాట్‌లను భారత గోల్‌కీపర్‌ నిధి నిలువరించి టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. 

ఫైనల్‌ చేరుకునే క్రమంలో లీగ్‌ దశలో చైనా చేతిలో మాత్రమే ఓడిపోయిన భారత జట్టుకు టైటిల్‌ పోరులోనూ గట్టిపోటీ ఎదురైంది. తొలి 29 నిమిషాల వరకు రెండు జట్లు ఖాతా తెరువలేకపోయాయి. 30వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను చైనా జట్టు సద్వినియోగం చేసుకుంది. టాన్‌ జిన్‌జువాంగ్‌ గోల్‌ చేయడంతో మాజీ చాంపియన్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 

ఆ తర్వాత 41వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను కనిక సివాచ్‌ గోల్‌గా మలచడంతో భారత్‌ స్కోరును 1–1తో సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్‌ చేయడానికియత్నించినా ఫలితం లేకపోయింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)