T20 World Cup 2024: బార్బడోస్‌లో ఇరుక్కుపోయిన టీమిండియా

Published on Mon, 07/01/2024 - 07:33

టీ20 వరల్డ్‌కప్‌ 2024 విజయానంతరం భారత క్రికెట్‌ బృందం బార్బడోస్‌లోనే (ఫైనల్‌ మ్యాచ్‌కు వేదిక) ఇరుక్కుపోయింది. అట్లాంటిక్‌లో ఉద్భవించిన 'బెరిల్' హరికేన్ కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో టీమిండియా బార్బడోస్‌లోనే ఉండిపోయింది. హరికేన్‌ ప్రభావం తగ్గి విమాన సర్వీసులు పునరుద్ధరించబడితే రేపటి కల్లా టీమిండియా ఢిల్లీలో ల్యాండ్‌ అవుతుంది. 

బార్బడోస్‌లో భారత బృందం హిల్టన్‌లో బస చేస్తుంది. షెడ్యూల్‌ ప్రకారం టీమిండియా ఇవాళ (జులై 1) ఉదయం 11 గంటలకంతా భారత్‌లో ల్యాండ్‌ కావల్సి ఉండింది. భారత రూట్‌ మ్యాప్‌ బార్బడోస్‌ నుంచి న్యూయార్క్‌కు.. న్యూయార్క్‌ నుంచి దుబాయ్‌కు.. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకునేలా ఉండింది. అయితే బెరిల్‌ హరికేన్‌ టీమిండియా రిటర్న్‌ ప్లాన్లు దెబ్బతీసింది.

ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌ 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి రెండోసారి జగజ్జేతగా నిలిచిన టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. భారత ఆటగాళ్లు ఢిల్లీలో ల్యాండ్‌ కాగానే ఘన స్వాగతం పలకాలని ప్లాన్లు చేసుకున్నారు. భారత ప్రభుత్వం సైతం వరల్డ్‌కప్‌ హీరోలను ఘనంగా స్వాగతం పలకాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది. 

భారత్‌లోకి ఎంటర్‌ కాగానే టీమిండియా హీరోలను ఊరేగింపుగా తీసుకెళ్లాలని ప్లాన్లు చేసుకుంది. ఈ తంతు అనంతరం భారత క్రికెట్‌ బృందం ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది. ప్రధాని నివాసంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం ఉండనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బీసీసీఐ నిన్న వరల్డ్‌కప్‌ గెలిచిన భారత  బృందానికి రూ. 125 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. ఈ స్థాయి భారీ మొత్తాన్ని క్రికెట్‌ చరిత్రలో ఏ జట్టు అందుకుని ఉండకపోవచ్చు. బీసీసీఐ తమ హీరోల గౌరవార్దం ఈ భారీ నగదు నజరానాను ప్రకటించింది. 
 

Videos

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)